Telugu Global
National

ప్రజల వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడమని మోడీని కోరిన 80 దేశాల రచయితలు

మోడీ పాల‌న‌లో భార‌త‌దేశంలో వాక్ స్వాతంత్రం పూర్తిగా అణ‌గ‌దొక్క‌బ‌డింద‌ని పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. పూణెలో జ‌రిగిన 84వ అంత‌ర్జాతీయ పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాంగ్రెస్ స‌మావేశంలో 80 దేశాల‌కు చెందిన ర‌చ‌యిత‌లు పాల్గొన్నారు. దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ప‌రిర‌క్షించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌తినిధులు కోరారు. పూణె స‌మావేశం త‌ర్వాత పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. దేశంలో జ‌ర్న‌లిస్టులు, ర‌చ‌యిత‌లు, విద్యార్ధులు తమ అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా వెల్లడిస్తున్న కార‌ణంగా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని […]

ప్రజల వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడమని మోడీని కోరిన 80 దేశాల రచయితలు
X

మోడీ పాల‌న‌లో భార‌త‌దేశంలో వాక్ స్వాతంత్రం పూర్తిగా అణ‌గ‌దొక్క‌బ‌డింద‌ని పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. పూణెలో జ‌రిగిన 84వ అంత‌ర్జాతీయ పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాంగ్రెస్ స‌మావేశంలో 80 దేశాల‌కు చెందిన ర‌చ‌యిత‌లు పాల్గొన్నారు. దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ప‌రిర‌క్షించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌తినిధులు కోరారు.

పూణె స‌మావేశం త‌ర్వాత పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. దేశంలో జ‌ర్న‌లిస్టులు, ర‌చ‌యిత‌లు, విద్యార్ధులు తమ అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా వెల్లడిస్తున్న కార‌ణంగా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని ఈ నివేదిక పేర్కొంది. భిన్నఅభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్న వ్య‌క్తులు బెదిరింపులు, వేధింపులు, ఆన్‌లైన్‌లో మాన‌సిక వేధింపులు, వ్య‌క్తిగ‌త హింస‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని తెలిపింది. కొన్నిసార్లు హ‌త్య‌ల‌కు కూడా గురౌతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకునే వ్య‌క్తుల‌పైనా, సంస్థ‌ల‌పైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే విధానం దేశంలో లేద‌ని పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ తేల్చి చెప్పింది. ర‌చ‌యిత‌ల‌పై దాడులు చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే విధంగా చ‌ట్టాల్లో మార్పులు చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ అభిప్రాయ‌ప‌డింది.

First Published:  30 Sep 2018 11:35 PM GMT
Next Story