Telugu Global
CRIME

పిల్లల్ని చూసి తల్లిని చంపలేదు....

వారు కరుడుగట్టిన క్రిమినల్స్. పైసల కోసం ఎవ్వరి ప్రాణాలైనా తీసే రకం.. ఇందులో రాగద్వేషాలకు తావులేదు. అలానే రూ.4 లక్షలకు ఓ హెడ్ కానిస్టేబుల్ తో సుపారీ మాట్లాడుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ చంపించేది తన సొంత భార్యనే. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అడ్డుగా ఉన్న తన భార్యను కడతేర్చాలని ప్లాన్ వేశాడు. ఈ క్రిమినల్స్ ముగ్గురు చంపడానికి వెళ్లారు. కానీ ఆమెను చంపకుండా వచ్చేశారు. ఇలా మూడు సార్లు చేశారు? ఆ […]

పిల్లల్ని చూసి తల్లిని చంపలేదు....
X

వారు కరుడుగట్టిన క్రిమినల్స్. పైసల కోసం ఎవ్వరి ప్రాణాలైనా తీసే రకం.. ఇందులో రాగద్వేషాలకు తావులేదు. అలానే రూ.4 లక్షలకు ఓ హెడ్ కానిస్టేబుల్ తో సుపారీ మాట్లాడుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ చంపించేది తన సొంత భార్యనే. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అడ్డుగా ఉన్న తన భార్యను కడతేర్చాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రిమినల్స్ ముగ్గురు చంపడానికి వెళ్లారు. కానీ ఆమెను చంపకుండా వచ్చేశారు. ఇలా మూడు సార్లు చేశారు? ఆ కరుడుగట్టిన హంతకులు ఆమెను ఎందుకు చంపలేదు…. ఎందుకు కరిగిపోయారనేది పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడది సంచలనంగా మారింది.

కర్ణాటకలోని శివమొగ్గలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రవీంద్రగిరికి దావణగెరెలోని అనితతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కూతురు ఉంది. రవీంద్రకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజూ దీనిపై గొడవ పెడుతున్న భార్యను వదిలించుకోవాలని చూశాడు. భార్యను చంపి ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. దీనికి గాను కాంట్రాక్ట్ కిల్లర్ ఫిరోజ్ తో రూ. 4 లక్షలకు రవీంద్రగిరి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

డబ్బులు తీసుకున్న ఫిరోజ్ తన అనుచరులు సయ్యద్ ఇర్ఫాన్, సుహైల్ తో కలిసి మూడు సార్లు అనిత ఇంటికి వెళ్లి చంపడానికి ప్రయత్నించారు. పిల్లలు ఏడ్వడం చూసి కరిగిపోయి చంపకుండా వచ్చేశారు. మూడోసారి వస్తూ పోలీసులకు దొరికిపోయారు. హెడ్ కానిస్టేబుల్ భార్య ఫొటో నిందితుల వద్ద చూసి పోలీసులు ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది.

దీంతో ఈ ముగ్గురు నిందితులతో పాటు భర్త హెడ్ కానిస్టేబుల్ రవీంద్రగిరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చిన్న పిల్లలను అనాథలను చేయడం ఇష్టం లేక క్రిమినల్స్ కరిగిపోయారు గానీ, ఆ కర్కశ భర్త కాఠిన్యం మాత్రం అలాగే ఉండిపోయింది.

First Published:  28 Sept 2018 7:15 AM IST
Next Story