కొలంబియా అమ్మాయి, భారత అబ్బాయి
ఇద్దరినీ కలిపింది చెస్ ఒలింపియాడ్ చెస్ ఒలింపియాడ్ వేదికగా ప్రపోజల్ ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని, భాషా భేదాలు అసలే లేవని భారత మాజీ చెస్ ప్లేయర్ కమ్ ఎడిటర్ నిఖిలేశ్ జైన్, కొలంబియా చెస్ గ్రాండ్ మాస్టర్ ఏంజెలో ఫ్రాంకో జంట మరోసారి నిరూపించారు. జార్జియాలోని బటుమీ వేదికగా జరుగుతున్న 2018 చెస్ ఒలింపియాడ్ ను వేదికగా చేసుకొన్నారు. భారత చెస్ మాజీ ప్లేయర్ నిఖిలేశ్ హిందీ భాషలో వెలువడే ఓ చదరంగ పత్రికకు ఎడిటర్ […]
- ఇద్దరినీ కలిపింది చెస్ ఒలింపియాడ్
- చెస్ ఒలింపియాడ్ వేదికగా ప్రపోజల్
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని, భాషా భేదాలు అసలే లేవని భారత మాజీ చెస్ ప్లేయర్ కమ్ ఎడిటర్ నిఖిలేశ్ జైన్, కొలంబియా చెస్ గ్రాండ్ మాస్టర్ ఏంజెలో ఫ్రాంకో జంట మరోసారి నిరూపించారు.
జార్జియాలోని బటుమీ వేదికగా జరుగుతున్న 2018 చెస్ ఒలింపియాడ్ ను వేదికగా చేసుకొన్నారు.
భారత చెస్ మాజీ ప్లేయర్ నిఖిలేశ్ హిందీ భాషలో వెలువడే ఓ చదరంగ పత్రికకు ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
అంతర్జాతీయ చెస్ టోర్నీల్లో పాల్గొనే సమయంలో ఏంజెలోతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏంజెలోని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలన్న నిర్ణయాన్ని తెలపటానికి నిఖిలేశ్…. ప్రపంచకప్ చెస్ వేదికనే ఉపయోగించుకొన్నాడు.
రెండోరౌండ్ పోటీలు ప్రారంభానికి ముందు…. కొలంబియా జట్టు సభ్యురాలు ఏంజెలో ఫ్రాంకోకు…. నిఖిలేశ్ తన ప్రేమ విషయాన్ని తెలిపాడు.
చేతివేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగి…తనకు జీవిత భాగస్వామిగా ఉండాలని కోరాడు.
నిఖిలేశ్ అభ్యర్థనతో మురిసిపోయిన ఏంజెలో…. ముసిముసి నవ్వులతో చేతికి ఉంగరాన్ని తొడిగించుకొని మరీ తన ఆమోదం తెలిపింది.
ఆంగ్లం తెలియని ఏంజెలో, స్పానిష్ భాష రాని నిఖిలేశ్ హావభావాలతోనే తమ ప్రేమను పంచుకొంటూ…. ప్రపోజల్ వరకూ రావటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమ జంటకు… చదరంగ వేదికే దేవాలయమని…. ప్రేమను పంచుకోడానికి, పెంచుకోడానికి….189 దేశాలకు చెందిన ప్లేయర్లు తలపడుతున్న చెస్ ఒలింపియాడ్ ను మించిన వేదిక మరొకటి ఉండదని నిఖిలేశ్ పొంగిపోతున్నాడు.
కొలంబియా అమ్మాయి… భారత అబ్బాయిల ప్రేమబంధాన్ని చూస్తే ప్రేమంటే ఇదేరా …అనుకోక తప్పదు.