Telugu Global
International

ఆసియాకప్ ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో బంగ్లాపై టీమిండియాదే పైచేయి

34 మ్యాచ్ ల్లో టీమిండియా 28, బంగ్లా 5 విజయాలు గత 16 ఏళ్లలో ఆసియాకప్ ఫైనల్లో ఎనిమిదోసారి టీమిండియా 2018 ఆసియాకప్ ఫైనల్లో…రెండోర్యాంకర్ కమ్ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు…7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ సవాల్ విసురుతోంది. 1988 నుంచి 2018 వరకూ…. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే… టీమిండియానే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. రెండుజట్లూ 34 సార్లు తలపడితే… టీమిండియా 28, బంగ్లాదేశ్ ఐదు విజయాల రికార్డుతో ఉన్నాయి. ఓ మ్యాచ్ ఫలితం […]

ఆసియాకప్ ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో బంగ్లాపై టీమిండియాదే పైచేయి
X
  • 34 మ్యాచ్ ల్లో టీమిండియా 28, బంగ్లా 5 విజయాలు
  • గత 16 ఏళ్లలో ఆసియాకప్ ఫైనల్లో ఎనిమిదోసారి టీమిండియా

2018 ఆసియాకప్ ఫైనల్లో…రెండోర్యాంకర్ కమ్ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు…7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ సవాల్ విసురుతోంది.

1988 నుంచి 2018 వరకూ…. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే… టీమిండియానే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

రెండుజట్లూ 34 సార్లు తలపడితే… టీమిండియా 28, బంగ్లాదేశ్ ఐదు విజయాల రికార్డుతో ఉన్నాయి. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

1995 నుంచి 2018 మధ్యకాలంలో రెండు జట్లు ముఖాముఖీ తొమ్మిది మ్యాచ్ ల్లో ఢీ కొంటే టీమిండియా 8 విజయాలు, బంగ్లాదేశ్ ఒక్క గెలుపు రికార్డుతో ఉన్నాయి.

మరో వైపు…గత 16 సంవత్సరాల కాలంలో.. టీమిండియా ఆసియాకప్ ఫైనల్స్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఏడోసారి టీమిండియా ఆసియాకప్ నెగ్గితే అది మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

First Published:  28 Sept 2018 5:10 AM GMT
Next Story