Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ బయోపిక్ పై జోరుగా బెట్టింగ్

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే బాలయ్య లుక్ బయటకు వచ్చేసింది. 2-3 స్టిల్స్ వచ్చాయి. ఏఎన్నార్ లుక్ తో పాటు చంద్రబాబు గెటప్ కూడా రిలీజ్ అయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్స్ రావడంతో సినిమాకు మార్కెట్ పెరిగింది. ఇదే ఊపులో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ చకచకా క్లోజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ డీల్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కృష్ణా, ఉత్తరాంధ్ర, కర్ణాటక హక్కుల్ని […]

ఎన్టీఆర్ బయోపిక్ పై జోరుగా బెట్టింగ్
X

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే బాలయ్య లుక్ బయటకు వచ్చేసింది. 2-3 స్టిల్స్ వచ్చాయి. ఏఎన్నార్ లుక్ తో పాటు చంద్రబాబు గెటప్ కూడా రిలీజ్ అయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్స్ రావడంతో సినిమాకు మార్కెట్ పెరిగింది. ఇదే ఊపులో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ చకచకా క్లోజ్ చేస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ డీల్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కృష్ణా, ఉత్తరాంధ్ర, కర్ణాటక హక్కుల్ని ఎప్పట్లానే సాయి కొర్రపాటి తన వద్ద ఉంచుకున్నారు. తనే సొంతంగా ఎన్టీఆర్ బయోపిక్ ను విడుదల చేయడానికి నిర్ణయించారు. దీనికంటే పెద్ద వార్త ఇంకోటుంది. ఈ సినిమాతో ఏకంగా ఏషియన్ సునీల్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతున్నారు.

ఏషియన్ మూవీస్ వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ కొత్తకాదు. కానీ వాళ్లు ఎక్కువగా ఎగ్జిబిటర్లు గానే వ్యవహరిస్తారు. నైజాంకు సంబంధించి దిల్ రాజు లాంటి నిర్మాతలు మాత్రమే పెద్ద సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. కానీ ఈసారి ఎన్టీఆర్ బయోపిక్ ను మాత్రం ఏషియన్ సునీల్ తీసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ మొత్తం తనే చూసుకుంటున్నారు. బాలయ్యతో సునీల్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఈ డీల్ ఈజీగా సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు.

First Published:  26 Sep 2018 8:55 PM GMT
Next Story