Telugu Global
National

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదు " సుప్రీం కోర్టు

ఎస్సీఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ల కోటా అవసరం లేదని తేల్చిచెప్పింది. గతంలో ఇదే అంశంపై నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో డేటా సేకరించాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు […]

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదు  సుప్రీం కోర్టు
X

ఎస్సీఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ల కోటా అవసరం లేదని తేల్చిచెప్పింది.

గతంలో ఇదే అంశంపై నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో డేటా సేకరించాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం లేదని, ఒకవేళ కల్పించాలంటే కోటాను సమర్థించే విధంగా స్పష్టమైన సమాచారం ప్రభుత్వం చూపాలని 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

తీర్పును మరోసారి సమీక్షించాలని, తీర్పును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

First Published:  26 Sept 2018 9:38 AM IST
Next Story