Telugu Global
Cinema & Entertainment

"జెర్సీ" మూవీ షూటింగ్'కి రెడీ అయిన నాని

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి “దేవదాస్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ 2 తో కూడా నాని బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ 2 అయిపోయిన తరువాత నాని “మళ్ళి రావా” ఫేం గౌతం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. “జెర్సీ” టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. పూర్తీ స్థాయి స్పోర్ట్స్ […]

జెర్సీ మూవీ షూటింగ్కి రెడీ అయిన నాని
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి “దేవదాస్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ 2 తో కూడా నాని బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ 2 అయిపోయిన తరువాత నాని “మళ్ళి రావా” ఫేం గౌతం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. “జెర్సీ” టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. పూర్తీ స్థాయి స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దసరా పండుగ నుండి మొదలవనుంది. తన పాత్రకోసం క్రికెట్ పైనే దృష్టి పెట్టి ట్రైనింగ్ క్లాసులు కూడా అట్టెండ్ అవుతున్నాడు నాని. దసరా లోపల క్రికెట్ కోచింగ్ తీసుకుని దసరా నుండి నాని సెట్స్ కి వెళ్లనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే అనిరుద్ ఈ సినిమాకి సంభందించి పాటల రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  26 Sept 2018 11:24 AM IST
Next Story