వివాదాల్లో బెల్లం కొండ హీరో
హీరోలు లేదా హీరోయిన్స్ తమ సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరి మనోభావాలు అయిన దెబ్బ తింటే ఆ సెలబ్రిటీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు బెల్లంకొండ హీరో. ఆ వివరాల్లోకి వెళితే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో జరుగుతుంది. […]
హీరోలు లేదా హీరోయిన్స్ తమ సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరి మనోభావాలు అయిన దెబ్బ తింటే ఆ సెలబ్రిటీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు బెల్లంకొండ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో భాగంగా ఒక ఏనుగు దంతాల పైన కూర్చుని ఒక ఫోటో తీసుకున్నాడు.. ఆ ఫోటో తీసుకోవడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకి లైక్స్ కన్నా విమర్శలు ఎక్కువగా రావడంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేసేశాడు. కొంత మంది అయితే ఏనుగుని హర్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ని వదిలిపెట్టొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో వల్ల సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ ట్రోలింగ్ బారిన పడుతున్నాడు. కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇది చట్టరీత్యానేరం… బెల్లంకొండ శ్రీనివాస్ పై తగిన యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారు.