Telugu Global
National

వసుంధరపై పోటీకి ఐపీఎస్‌ భార్య సై!

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ ఐపీఎస్‌ అధికారి భార్య సన్నద్ధమవుతున్నారు. వసుంధర ప్రాతినిధ్యం వహిస్తున్న ఝల్రాపటాన్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజస్థాన్‌ కేడర్‌ 2009 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి పంకజ్‌ చౌదరి భార్య ముకుల్‌ చౌదరి ముఖ్యమంత్రిపై పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఏలుబడిలో ప్రజలు అనేక అన్యాయాలకు గురి అవుతున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను ముఖ్యమంత్రిపై పోటీకి […]

వసుంధరపై పోటీకి ఐపీఎస్‌ భార్య సై!
X

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ ఐపీఎస్‌ అధికారి భార్య సన్నద్ధమవుతున్నారు. వసుంధర ప్రాతినిధ్యం వహిస్తున్న ఝల్రాపటాన్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు.

రాజస్థాన్‌ కేడర్‌ 2009 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి పంకజ్‌ చౌదరి భార్య ముకుల్‌ చౌదరి ముఖ్యమంత్రిపై పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఏలుబడిలో ప్రజలు అనేక అన్యాయాలకు గురి అవుతున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను ముఖ్యమంత్రిపై పోటీకి దిగాలని నిర్ణయం తీసుకున్నానని ముకుల్‌ చౌదరి చెబుతున్నారట.

విశేషమేమిటంటే ఝల్రాపటాన్‌ ముకుల్‌ చౌదరి పుట్టిన ఊరు. అవినీతి, అసమర్థపాలనకు వ్యతిరేకంగా తాను పోరాడతానని ముకుల్‌ చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం మొత్తం అనేక విధాలుగా ఇక్కట్ల పాలయ్యిందని ఆమె అంటున్నారు. అవినీతి విశృంఖలంగా మారిందని, నేరాల రేటు కూడా దారుణంగా పెరిగిపోయిందని ముకుల్‌ చెబుతున్నారు.

ఈ అంశాలపైనే తాను క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేస్తున్నందుకు గాను తన భర్తను తరచుగా బదిలీ చేస్తున్నారని, అనేక రకాలుగా హింసిస్తున్నారని ముకుల్‌ వివరించారు.

First Published:  24 Sept 2018 11:40 AM IST
Next Story