Telugu Global
NEWS

మందు పాతర పెట్టి.... వెంటనే వ్యూహం మార్చి....

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్యకు మావోయిస్టులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు, నిఘా నిద్ర మత్తులో ఉందని గ్రహించిన మావోయిస్టులు ధైర్యంగా అరకువైపు చొచ్చుకొచ్చారు. దాదాపు 70 మంది మావోయిస్టులు ఎమ్మెల్యేపై దాడిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను మందుపాతర పేల్చడం ద్వారా హత్య చేయాలని తొలుత మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వెంట పెద్దగా భద్రతా సిబ్బంది గానీ, అనుచరులు గానీ లేరన్నది నిర్ధారించుకున్న తర్వాత వ్యూహం మార్చేశారు. నేరుగా […]

మందు పాతర పెట్టి.... వెంటనే వ్యూహం మార్చి....
X

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్యకు మావోయిస్టులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు, నిఘా నిద్ర మత్తులో ఉందని గ్రహించిన మావోయిస్టులు ధైర్యంగా అరకువైపు చొచ్చుకొచ్చారు.

దాదాపు 70 మంది మావోయిస్టులు ఎమ్మెల్యేపై దాడిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను మందుపాతర పేల్చడం ద్వారా హత్య చేయాలని తొలుత మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వెంట పెద్దగా భద్రతా సిబ్బంది గానీ, అనుచరులు గానీ లేరన్నది నిర్ధారించుకున్న తర్వాత వ్యూహం మార్చేశారు. నేరుగా కార్లకే అడ్డు వెళ్లి వాటిని ఆపి… నింపాదిగా ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను కిందకు దింపారు.

పక్కకు తీసుకుళ్లి ఇద్దరిని 20 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పినా మైనింగ్ ప్రయత్నాలు మానుకోరా అని మహిళా మావోయిస్టులు ప్రశ్నించగా… క్షమించండి మేడమ్ అంటూ సర్వేశ్వరరావు బతిమలాడుకున్నారని చెబుతున్నారు. కానీ వారు ఎమ్మెల్యేను కాల్చేశారు. మరికొద్ది దూరంలో మాజీ ఎమ్మెల్యే సోమాను కూడా చంపేశారు.

ఇలా ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను చంపేసిన తర్వాత మావోయిస్టులు దగ్గరలోనే మలుపు వద్ద ఏర్పాటు చేసిన మందుపాతరను తవ్వి తీసుకెళ్లారు. మలుపు వద్ద మందుపాతర పేల్చేందుకు మావోయిస్టులు తొలుత ప్లాన్ చేశారని… కానీ ఎమ్మెల్యే వెంట పెద్దగా బలగం లేకపోవడంతో నింపాదిగా హత్య చేశారని చెబుతున్నారు.

First Published:  24 Sept 2018 5:30 AM IST
Next Story