భర్త నాలుక కొరికేసిన భార్య
ఢిల్లీలో దారుణం జరిగింది. క్షణికావేశంలో నిగ్రహం కోల్పోయిన ఓ గృహిణి భర్త నాలుకను కొరికేసింది. పైశాచికంగా ప్రవర్తించి భర్తను ఆసుపత్రి పాలు చేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు తిరిగి మాట్లడలేని పరిస్థితి నెలకొంది. ఈ దారుణ సంఘటన శనివారం రాత్రి ఢిల్లీలో జరిగింది. భర్త ఫిర్యాదుతో ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 326కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాజల్ సింగ్ అనే యువతి…. తన భర్త కరణ్ సింగ్తో కలిసి […]
ఢిల్లీలో దారుణం జరిగింది. క్షణికావేశంలో నిగ్రహం కోల్పోయిన ఓ గృహిణి భర్త నాలుకను కొరికేసింది. పైశాచికంగా ప్రవర్తించి భర్తను ఆసుపత్రి పాలు చేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు తిరిగి మాట్లడలేని పరిస్థితి నెలకొంది. ఈ దారుణ సంఘటన శనివారం రాత్రి ఢిల్లీలో జరిగింది. భర్త ఫిర్యాదుతో ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 326కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాజల్ సింగ్ అనే యువతి…. తన భర్త కరణ్ సింగ్తో కలిసి ఢిల్లీలో వికాస్ నగర్లో నివాసముంటోంది. 2016 నవంబర్లో వారిద్దరికీ వివాహం అయింది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. కరణ్ సింగ్ తల్లితండ్రులు కూడా వారితో కలిసి ఉంటున్నారు.
శనివారం రాత్రి 11 గంగల ప్రాంతంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోనే ఉన్న కరణ్ సింగ్ తల్లిదండ్రులు సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. భార్యాభర్తలిద్దరూ తమ గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కరణ్ సింగ్ తన గదిలో నుంచి అరుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడి నోటి నుంచి రక్తం కారుతోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్నారు. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తెగిపోయిన నాలుకను అతికించలేకపోయారు. మెరుగైన చికిత్స నిమిత్తం సఫ్దార్జంగ్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో బాధితుడిని తల్లిదండ్రులు కరణ్సింగ్ను సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తరలించారు.