Telugu Global
NEWS

బొమ్మిరెడ్డి అసలు స్టామినా ఇదీ....

వైసీపీలో తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని అందుకే పార్టీ వీడుతున్నానని మొన్నటి వరకు వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి చెప్పారు. నిజానికి బొమ్మిరెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి వైసీపీ బాధ్యతలు అప్పగించగానే బొమ్మిరెడ్డి రాజీనామా చేశారు. ఒకప్పుడు బొమ్మిరెడ్డి కుటుంబపెద్దలు ఆనం కుటుంబానికి అనుచరులుగా ఉన్న వారే. తొలుత బొమ్మిరెడ్డి కాంగ్రెస్‌ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. ఆతర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. […]

బొమ్మిరెడ్డి అసలు స్టామినా ఇదీ....
X

వైసీపీలో తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని అందుకే పార్టీ వీడుతున్నానని మొన్నటి వరకు వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి చెప్పారు. నిజానికి బొమ్మిరెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి వైసీపీ బాధ్యతలు అప్పగించగానే బొమ్మిరెడ్డి రాజీనామా చేశారు. ఒకప్పుడు బొమ్మిరెడ్డి కుటుంబపెద్దలు ఆనం కుటుంబానికి అనుచరులుగా ఉన్న వారే.

తొలుత బొమ్మిరెడ్డి కాంగ్రెస్‌ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. ఆతర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. బొమ్మిరెడ్డి ఒక దశలో టీడీపీలో చేరేందుకు చంద్రబాబును కూడా కలిశారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో ఆ పార్టీలో చేరి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

పీఆర్పీ జిల్లా కన్వీనర్‌గా ఈయన చేసిన రాజకీయం నెల్లూరులో ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. గతంలో తాను ఎమ్మెల్సీగా గెలవడంలో అండగా నిలిచిన కొమ్మి లక్ష్మీనారాయణకు వెన్నుపోటు పొడిచాడన్న ఆరోపణ కూడా బొమ్మిరెడ్డి పై ఉంది .

ఇప్పుడు జగన్‌పై ఎలాంటి విమర్శలు చేశారో… 2009లో పీఆర్పీని వీడే సమయంలోనూ చిరంజీవిపై అలాంటి విమర్శలే చేశారు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి. జిల్లా కన్వీనర్‌గా విఫలమయ్యారన్న ఉద్దేశంతో పదవి నుంచి తనను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించడంతో బొమ్మిరెడ్డికి కోపం వచ్చింది.

చిరంజీవి వేస్ట్‌…. రాజకీయాలకు పనికి రాడు అంటూ అప్పట్లో పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చారు బొమ్మిరెడ్డి. ఇప్పటి వరకు ఏ పార్టీ వల్ల ఆయన నష్టపోయింది లేదు. ఆయన వల్లే పార్టీలు నష్టపోయాయని చెబుతుంటారు.

కాంగ్రెస్‌ జెడ్పీటీసీని చేస్తే ఆ పార్టీకి హ్యాండ్‌ ఇచ్చేశారు. ఎమ్మెల్సీగా గెలవడంలో టీడీపీ నేత కొమ్మి లక్ష్మయ్య సపోర్టు చేస్తే ఆయన్ను గతంలో ఎన్నికల్లో ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. పీఆర్పీ జిల్లా కన్వీనర్ పోస్టు ఇస్తే ఆఖరికి చిరంజీవే వేస్ట్ అంటూ బయటకు వచ్చేశారని నెల్లూరు నేతలు గుర్తు చేస్తున్నారు.

వెంకటగిరి ఇన్‌చార్జ్ నుంచి తొలగించి తనను అవమానించారని చెబుతున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి… ప్రస్తుతం నెల్లూరు జెడ్పీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ పదవి వచ్చింది కూడా వైసీపీ ద్వారానే. కానీ దానికి రాజీనామా చేయని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి… నీతి సూక్తులు చెప్పడం ఏమిటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

జగన్‌ను డబ్బు మనిషి అని ప్రచారం చేస్తున్న బొమ్మిరెడ్డి… మరి జెడ్పీ చైర్మన్‌ పదవికి కూడా డబ్బులిచ్చారేమో చెప్పాలని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.

First Published:  24 Sept 2018 5:20 AM IST
Next Story