Telugu Global
NEWS

ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో బాగా దెబ్బకొట్టిన ప్రాంతంలో ఉత్తరాంధ్ర కూడా ముందు వరుసలో ఉంటుంది. మరీ గోదావరి జిల్లాల మాదిరి కాకపోయినా…. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడింది. ఈ జిల్లాల్లో కొన్ని సీట్లను వైసీపీ సాధించుకుంది. కానీ.. అసలు విజయానికి అవి ఏ మాత్రం సరిపోయేవి కావు. ఇక అలా గెలిచిన వాళ్లలో కొంతమందిని కూడా చంద్రబాబు తన వైపుకు తిప్పుకున్నాడు. వాళ్లను కొనేశాడు అనేది బహిరంగ […]

ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏంటి?
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో బాగా దెబ్బకొట్టిన ప్రాంతంలో ఉత్తరాంధ్ర కూడా ముందు వరుసలో ఉంటుంది. మరీ గోదావరి జిల్లాల మాదిరి కాకపోయినా…. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడింది. ఈ జిల్లాల్లో కొన్ని సీట్లను వైసీపీ సాధించుకుంది. కానీ.. అసలు విజయానికి అవి ఏ మాత్రం సరిపోయేవి కావు.

ఇక అలా గెలిచిన వాళ్లలో కొంతమందిని కూడా చంద్రబాబు తన వైపుకు తిప్పుకున్నాడు. వాళ్లను కొనేశాడు అనేది బహిరంగ రహస్యమే. మరి వాళ్లు వెళ్లిపోవడంతో వైసీపీ మరింత బలహీనపడిందని విశ్లేషణలు వినిపించాయి. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది జగన్ పాదయాత్ర. ఉత్తరాంధ్రలో వైసీపీ చాలా వీక్ అయిపోయిందన్న వార్తల నేపథ్యంలో జగన్ పాదయాత్రకు అక్కడ లభిస్తున్న స్పందన వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది.

ఉత్తరాంధ్రలో…. ప్రత్యేకించి విశాఖ జిల్లా పరిధిలో వైసీపీ మరీ వీక్ అనుకుంటే…. అక్కడ జగన్ పాదయాత్రకు బీభత్సమైన స్పందన వచ్చింది. విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి అవుతున్న తరుణంలో ఇక్కడ వచ్చిన స్పందనతో వైసీపీ శ్రేణుల ఆనందానికి అవదులు లేవు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది కూడా ఆసక్తిదాయకమే.

ఇక్కడ గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి బలం పెరిగే ఉండాలి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగానే ఉంది. అయితే పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలో ఈ మధ్య బాగానే తిరిగాడు. అయితే పవన్ కల్యాణ్ విరామాల యాత్రతో ఊపు ఏదైనా వచ్చినా అది కాస్తా తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఉత్తరాంధ్రలో ఇక జగన్ పాదయాత్ర అడుగడుగునా ఆసక్తిదాయకమే!

First Published:  23 Sept 2018 4:10 AM IST
Next Story