Telugu Global
National

ఆమ్ ఆద్మీ పార్టీలోకి.... యశ్వంత్ సిన్హా, శ‌తృఘ్న సిన్హా?

గ‌త కొంత కాలంగా బిజెపిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న యశ్వంత్ సిన్హా, శ‌తృఘ్న సిన్హాలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ కేజ్రీవాల్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. య‌శ్వంత్ సిన్హా న్యూ ఢిల్లీ పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్నార‌ని…. శ‌తృఘ్న సిన్హా వెస్ట్ ఢిల్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. నోయిడాలో నిర్వ‌హించిన జ‌న్ అధికార్ ర్యాలీలో […]

ఆమ్ ఆద్మీ పార్టీలోకి.... యశ్వంత్ సిన్హా, శ‌తృఘ్న సిన్హా?
X

గ‌త కొంత కాలంగా బిజెపిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న యశ్వంత్ సిన్హా, శ‌తృఘ్న సిన్హాలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ కేజ్రీవాల్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. య‌శ్వంత్ సిన్హా న్యూ ఢిల్లీ పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్నార‌ని…. శ‌తృఘ్న సిన్హా వెస్ట్ ఢిల్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్నార‌ని తెలుస్తోంది.

నోయిడాలో నిర్వ‌హించిన జ‌న్ అధికార్ ర్యాలీలో కేజ్రీవాల్ య‌శ్వంత్ సిన్హా ముందు ఓ ప్ర‌తిపాద‌న ఉంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని కోరారు. మీ లాంటి మంచి వ్య‌క్తులు పోటీ చేయ‌క‌పోతే ఇంకెవ‌రు పోటీ చేస్తార‌ని కేజ్రీవాల్ య‌శ్వంత్ సిన్హాను ప్ర‌శ్నించారు. మీలాంటి వ్య‌క్తులు పోటీ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని కేజ్రీవాల్ అన్నారు.

బిజెపితో అభిప్రాయ‌భేదాలు వ‌చ్చిన త‌ర్వాత య‌శ్వంత్ సిన్హా ఆ పార్టీని వీడారు. 2018 ఏప్రిల్ 21న పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్ప‌టి నుంచి మోడీ పాల‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

మ‌రోవైపు శ‌తృఘ్న సిన్హా కూడా సొంత పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీ తీసుకునే త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం, మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల గురించి అనేక విమ‌ర్శ‌లు చేశారు. పార్టీకి తాను స్వ‌త‌హాగా రాజీనామా చేయ‌న‌ని…. వీలైతే త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పార్టీకి స‌వాలు విసిరారు.

First Published:  23 Sept 2018 4:15 AM IST
Next Story