పొగ తాగడానికి గుడ్‌బై
‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పాకెట్లపైనే ఉంటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన ఎంతటి చెడు ప్రభావాన్ని చూపిస్తుందో, పొగతాగే వారిలో 90% మందికి తెలుసు. అయినప్పటికీ ఈ దురలవాటును మానడం వీరికి అసాధ్యంగా ఉంటుంది. పొగతాగే అలవాటుకు స్వస్తి చెప్పాలని అనేక సార్లు ప్రయత్నించి విఫలమైన వారు వేలాది మంది ఉంటారు. అయితే సరైన పద్ధతి అవలంబిస్తే ఈ దురలవాటుకు దూరం కావడం అసాధ్యమేమీ కాదు. పొగతాగే అలవాటుకు గుడ్‌బై చెప్పే మార్గాలు: […]
‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పాకెట్లపైనే ఉంటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన ఎంతటి చెడు ప్రభావాన్ని చూపిస్తుందో, పొగతాగే వారిలో 90% మందికి తెలుసు. అయినప్పటికీ ఈ దురలవాటును మానడం వీరికి అసాధ్యంగా ఉంటుంది. పొగతాగే అలవాటుకు స్వస్తి చెప్పాలని అనేక సార్లు ప్రయత్నించి విఫలమైన వారు వేలాది మంది ఉంటారు. అయితే సరైన పద్ధతి అవలంబిస్తే ఈ దురలవాటుకు దూరం కావడం అసాధ్యమేమీ కాదు.
పొగతాగే అలవాటుకు గుడ్‌బై చెప్పే మార్గాలు:
– రోజుకు రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగే అలవాటున్న వారు, ఒకేసారి ప్యాకెట్ కొనకుండా ఒక్కో సిగరెట్ కొనాలి. తాగిన ప్రతీసారి సిగరెట్ పూర్తిగా కాల్చకుండా సగంలో ఆపివేయాలి.
– ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు కాల్చకుండా సిగరెట్ కాల్చేందుకు సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ సమయం వరకు వేచి వుండాలి.
– తాగే సమయంలో పొగను కొద్దిగా మాత్రమే పీల్చుకోవాలి.
– సిగరెట్ తాగాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి.
– మీరు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు సిగరెట్ అందుబాటులో ఉంచుకోకుండా దూరంగా పెట్టాలి.
– యాష్ ట్రేని ఖాళీ చేయకూడదు. మీరు ఎన్ని సిగరెట్లు తాగారో అది గుర్తుచేస్తుంది.
నికొటిన్ చూయింగ్ గమ్
సిగరెట్ తాగాలనిపించినపుడు నికొటిన్ చూయింగ్ గమ్ నమిలితే చాలా వరకు కోరిక తీరుతుంది. ఇది సిగరెట్ అంత హానికరం కాదు. అయితే ఏకధాటిగా నమలకుండా కాసేపు దవడన ఉంచి మధ్యమధ్యలో నములుతూ ఉండాలి. మెల్లమెల్లగా దీన్ని కూడా తగ్గించాలి.
– చూయింగ్ గమ్ అలవాటు చేసుకున్నప్పుడు కొద్దిగా ఎసిడిటి వచ్చే అవకాశముంది. ఆకలి కూడా పెరుగుతుంది.
– గుండె జబ్బు, అధిక రక్తపోటు, అస్తమా వ్యాధులతో బాధపడుతున్న వారు నికొటిన్ చూయింగ్‌గమ్ అలవాటు చేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.