"నగర వనం"లో శృతిమించుతున్న రొమాన్స్
ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ‘నగర వనం’ ప్రేమికులకు అడ్డాగా మారింది. అక్కడికి వచ్చే జంటల చేష్టలకు పర్యాటకులు విస్తుపోతున్నారు. కొందరు చెట్ల పొదల్లో, ఇంకొందరు బహిరంగంగానే ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. చుట్టూ పర్యాటకులు ఉన్న విషయాన్ని కూడా మరచిపోతున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నగర వనాన్ని ప్రారంభించారు. సుమారు 500 ఎకరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎర్రచందనం, టేకు, వివిధ రకాల ఔషధ మొక్కలు, […]
ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ‘నగర వనం’ ప్రేమికులకు అడ్డాగా మారింది. అక్కడికి వచ్చే జంటల చేష్టలకు పర్యాటకులు విస్తుపోతున్నారు. కొందరు చెట్ల పొదల్లో, ఇంకొందరు బహిరంగంగానే ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. చుట్టూ పర్యాటకులు ఉన్న విషయాన్ని కూడా మరచిపోతున్నారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నగర వనాన్ని ప్రారంభించారు. సుమారు 500 ఎకరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎర్రచందనం, టేకు, వివిధ రకాల ఔషధ మొక్కలు, చెట్లు పెంచుతున్నారు. ‘నగర వనం’ అంతా కొండ ప్రాంతం కావడంతో చక్కని వాతావరణం ఉంటుంది. గుంటూరు నగర, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదం అందించడం ముఖ్య ఉద్దేశం.
ఈ పార్కు నిర్వహణ అంతా అటవీ శాఖ ఆదీనంలో ఉంది. అంతేకాకుండా జిల్లా అటవీ శాఖ కార్యాలయం కూడా ఇక్కడకి సమీపంలోనే ఉంది. నామమాత్రపు రుసుం చెల్లించిన తరువాత పర్యాటకులను లోపలికి పంపుతారు. లోపలికి వెళ్లిన వారు బయటకు ఎప్పుడు వస్తారో ఎవరూ పట్టించుకోరు.
క్రమేణా పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. నగర వనం చుట్టూ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. హాస్టళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేమికుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఆదివారం పూట తల్లిదండ్రులు చిన్నారులను ఈ పార్క్ కు తీసుకుని వస్తున్నారు. ఆ సమయంలో కొందరు యువతీ యువకుల అసభ్య కార్యకలాపాలకు వారు ఇబ్బంది పడుతున్నారు.
తాజాగా ఒక విద్యార్థిని తన సహచర విద్యార్థితో కలిసి ఉన్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది. దీనిపై సదరు విద్యార్థిని సొంత మండలంలో ఫిర్యాదు చేయడంతో, కేసును మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నగర వనం పార్కు బాగా విశాలంగా ఉండటంతో యువతీ యువకుల అసభ్య కార్యకలాపాలు నిలువరించే సిబ్బంది లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారిపోయింది.
నగర వనం విధుల్లో ఉన్న కొంత మంది సిబ్బంది నగదు తీసుకొని ప్రేమ జంటలకు ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఏ వైపు వెళ్లాలో కూడా వీరే చెబుతున్నారట. ఈ క్రమంలో కొందరు శ్రుతి మించి చెలరేగిపోతున్నారు. పార్కుకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నగర వనం ఉద్దేశ్యం పక్కదారి పడుతుంది. సందర్శకులతో కళకళలాడాల్సిన పార్కు యువతీయువకుల అసభ్య చేష్టలకు అడ్డాగా మారిపోయింది.