Telugu Global
NEWS

ఏజెన్సీలో టెన్షన్... పోలీస్ స్టేషన్లపై దాడులు....

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజా ప్రతినిధులకు భద్రతను మరింత పెంచారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే హత్యతో ఆయన వర్గీయులు సహనం కోల్పోయారు. పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే హత్య జరిగిందంటూ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. అరకు, డుంబ్రిగూడ పోలీసు స్టేషన్లపై దాడులు చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. స్టేషన్‌లో ఉన్న పోలీసులపైనా ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా దాడి […]

ఏజెన్సీలో టెన్షన్... పోలీస్ స్టేషన్లపై దాడులు....
X

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజా ప్రతినిధులకు భద్రతను మరింత పెంచారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే హత్యతో ఆయన వర్గీయులు సహనం కోల్పోయారు.

పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే హత్య జరిగిందంటూ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. అరకు, డుంబ్రిగూడ పోలీసు స్టేషన్లపై దాడులు చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. స్టేషన్‌లో ఉన్న పోలీసులపైనా ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు తాము ఎమ్మెల్యే కిడారిని ముందే హెచ్చరించామని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఈనెల 21న తాము నోటీసులు కూడా ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు.

తమకు చెప్పకుండా పర్యటనలు చేయవద్దని సూచించామంటున్నారు. హెచ్చరికలు జారీ చేసినప్పటికి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారో తమకు అర్థం కావడం లేదంటున్నారు.

First Published:  23 Sept 2018 10:46 AM GMT
Next Story