రాఫెల్ డీల్‌పై రచ్చ.... ప్రధానికి కేజ్రీవాల్ ట్వీట్
రాఫెల్ డీల్‌పై చెలరేగుతున్న వివాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఈ అంశంపై విస్తృత చర్చ చేపట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ప్రధాని మోడీని ట్విట్టర్ వేదికగా కోరారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన సూచన ప్రాధాన్యత సంతరించుకుంది. డాసల్ట్ ఏవియేషన్ కంపెనీకి పార్ట్‌నర్‌గా రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించడంతో తమకు ఛాయిస్ లేకుండా పోయిందని హోలాండే చేసిన వ్యాఖ్యలు […]
రాఫెల్ డీల్‌పై చెలరేగుతున్న వివాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఈ అంశంపై విస్తృత చర్చ చేపట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ప్రధాని మోడీని ట్విట్టర్ వేదికగా కోరారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన సూచన ప్రాధాన్యత సంతరించుకుంది.
డాసల్ట్ ఏవియేషన్ కంపెనీకి పార్ట్‌నర్‌గా రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించడంతో తమకు ఛాయిస్ లేకుండా పోయిందని హోలాండే చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో అలజడిని రేపాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసాయి.
విమర్శల దాడి పెంచిన రాహుల్
రాఫెల్ డీల్‌లో ముమ్మాటికీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అనిల్ అంబానీకి మేలు చేసేందుకే మోడీ నిర్ణయాలు తీసుకున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మోదీ, అంబానీ సంయుక్తంగా భద్రతా బలగాలపై రూ.1.3లక్షల కోట్ల సర్జికల్ స్ట్రైక్ చేశారని ఆరోపించారు. హోలండ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ బహిరంగ ప్రకటన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కు స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కుదరదని స్పష్టం చేశారు.