Telugu Global
Health & Life Style

అక్కడి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌ పెద్ద అక్షరాలతో రాయాల్సిందే!

డాక్టర్‌ రాసే ప్రిస్క్రిప్షన్‌ మనం చదవగలమా.. చిన్నక్షరాలు కలిపిరాసేస్తుంటారు. అది మందుల షాపు వాళ్లకు తప్ప మనకు అర్ధం కాదు. అందుకే జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రయివేటు డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందరికీ అర్ధమయ్యే రీతిలో పెద్ద అక్షరాలతో (కేపిటల్‌ లెటర్స్‌లో) ప్రిస్క్రిప్షన్‌ రాయాలని ఆదేశించింది. అంతేకాదు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రయివేటు నర్సింగ్‌హోంలు ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నియమనిబంధనలను పాటించాల్సిందేనని ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్‌లు పెద్ద అక్షరాలలో రాయడమే కాదు ఆయా మందుల జెనెరిక్‌ పేర్లను […]

అక్కడి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌ పెద్ద అక్షరాలతో రాయాల్సిందే!
X

డాక్టర్‌ రాసే ప్రిస్క్రిప్షన్‌ మనం చదవగలమా.. చిన్నక్షరాలు కలిపిరాసేస్తుంటారు. అది మందుల షాపు వాళ్లకు తప్ప మనకు అర్ధం కాదు. అందుకే జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రయివేటు డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందరికీ అర్ధమయ్యే రీతిలో పెద్ద అక్షరాలతో (కేపిటల్‌ లెటర్స్‌లో) ప్రిస్క్రిప్షన్‌ రాయాలని ఆదేశించింది.

అంతేకాదు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రయివేటు నర్సింగ్‌హోంలు ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నియమనిబంధనలను పాటించాల్సిందేనని ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్‌లు పెద్ద అక్షరాలలో రాయడమే కాదు ఆయా మందుల జెనెరిక్‌ పేర్లను కూడా ప్రిస్క్రిప్షన్‌లో తప్పనిసరిగా రాయాలని మెడికల్‌ కౌన్సిల్‌ నియమాలలో ఉంది. తగిన మందులను స్పష్టంగా పెద్ద అక్షరాలతోనే రాయాలని డాక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ అఖౌరీ శశాంక్‌ సిన్హా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ప్రిస్క్రిప్షన్‌ల విషయంలో డాక్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచిస్తూ 2016 సెప్టెంబర్‌ 28న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఆదేశాలను డాక్టర్లు పాటించడం లేదని జార్ఖండ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. అందుకే ఆ రాష్ట్రంలో తాజా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇవి పాటించని వైద్యులపై మూడు దశలలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలి దశలో హెచ్చరిస్తారని, రెండో దశలో రిజిస్ట్రేషన్‌ను కొద్దికాలం సస్పెండ్‌ చేస్తారని, మూడో దశలో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారని అధికారులు వివరించారు.

First Published:  23 Sept 2018 1:00 AM IST
Next Story