Telugu Global
NEWS

చంద్రబాబు వస్తారా?

విశాఖ ఏజెన్సీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపేశారు. దీంతో ఏజెన్సీలో అలజడి రేగింది. కిడారి అనుచరులు పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు. ఈనేపథ్యంలో శాంతిభద్రతలను సీఎంవో అధికారులు సమీక్షిస్తున్నారు. గత పదేళ్లలో ఒక ఎమ్మెల్యే స్థాయి నేతను ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు హత్య చేయడం ఇదే తొలిసారి. అందులోనూ ఒక గిరిజన ఎమ్మెల్యే హత్య గురికావడం కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల దృష్ట్యా…. […]

చంద్రబాబు వస్తారా?
X

విశాఖ ఏజెన్సీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపేశారు. దీంతో ఏజెన్సీలో అలజడి రేగింది. కిడారి అనుచరులు పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు.

ఈనేపథ్యంలో శాంతిభద్రతలను సీఎంవో అధికారులు సమీక్షిస్తున్నారు. గత పదేళ్లలో ఒక ఎమ్మెల్యే స్థాయి నేతను ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు హత్య చేయడం ఇదే తొలిసారి. అందులోనూ ఒక గిరిజన ఎమ్మెల్యే హత్య గురికావడం కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల దృష్ట్యా…. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి నేతకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ముఖ్యమంత్రులు ఇతర పర్యటనల్లో ఉన్నా వాటిని రద్దు చేసుకుని వెంటనే తిరుగుపయణం అవుతుంటారు. ఇప్పుడు ఏకంగా గిరిజన ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో చంద్రబాబు తన అమెరికా పర్యటన రద్దు చేసుకుని వెనక్కు వస్తారా? లేకుంటే ఈనెల 26 వరకు అక్కడే ఉంటారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది.

ఒక గిరిజన ఎమ్మెల్యేను, అందులోనూ అధికార పార్టీలోకి వచ్చిన కిడారిని హత్య చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిడారి అంత్యక్రియల్లో సీఎం పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

చూడాలి… రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకుని వెంటనే వస్తారా? లేదంటే యూఎన్‌ఈపీ ఏర్పాటు చేసిన సమావేశంలో తన ప్రసంగానికే ప్రాధాన్యత ఇస్తారా? అన్నది.

First Published:  23 Sept 2018 4:40 PM IST
Next Story