ప్రణయ్‌కు ఎఫైర్లు లేవు " అమృత
మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ పై కొందరు రకరకాల విమర్శలను చేస్తున్నారు. ప్రణయ్ ఒక రోమియో అని, 9వ తరగతి నుంచే ఎఫైర్లు కొనసాగించారంటూ కొందరు చెబుతున్నారు. బీటెక్‌లో ప్రణయ్ 23 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడంటూ సర్టిఫికేట్లను కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఈనేపథ్యంలో ఒక టీవీ చానల్ ఈ విషయాలపై ప్రణయ్ భార్య అమృతను వివరణ కోరింది. ప్రణయ్ ఒక రోమియో అట కదా.. 9వ తరగతిలో మిమ్మల్ని లవ్ చేస్తూనే ఇతరులతో కూడా ఎఫైర్లు […]

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ పై కొందరు రకరకాల విమర్శలను చేస్తున్నారు. ప్రణయ్ ఒక రోమియో అని, 9వ తరగతి నుంచే ఎఫైర్లు కొనసాగించారంటూ కొందరు చెబుతున్నారు. బీటెక్‌లో ప్రణయ్ 23 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడంటూ సర్టిఫికేట్లను కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.
ఈనేపథ్యంలో ఒక టీవీ చానల్ ఈ విషయాలపై ప్రణయ్ భార్య అమృతను వివరణ కోరింది. ప్రణయ్ ఒక రోమియో అట కదా.. 9వ తరగతిలో మిమ్మల్ని లవ్ చేస్తూనే ఇతరులతో కూడా ఎఫైర్లు నడిపేవారని చెబుతున్నారు నిజమేనా? అని ప్రశ్నించగా.. అమృత స్పందించారు. ప్రణయ్ రోమియో కాదని చెప్పారు.
కాలేజీలో స్నేహితులతో మాట్లాడుతుండవచ్చని…. తాను కూడా మాట్లాడుతుంటానని…. దాన్ని పట్టుకుని రోమియో అనడం సరికాదన్నారు. ప్రణయ్‌తో ఎక్కువగా ఉన్నది తానేనని…. ఒకవేళ ప్రణయ్ అలాంటి వాడైతే తనకు తెలియకుండా ఎలా ఉంటుందని అమృత ప్రశ్నించారు.
సినిమాకు వెళ్తే హీరోను అందరు అమ్మాయిలు చూస్తారని…. అలా అని ఆ హీరోను అమ్మాయిలంతా లవ్ చేయరు కదా అని అమృత ప్రశ్నించారు. అమ్మాయిలతో మాట్లాడినంత మాత్రాన రోమియో అనడం కరెక్ట్ కాదన్నారు. తనను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు రావడంపైనా అమృత తీవ్రంగా స్పందించారు.