Telugu Global
NEWS

దుర్గఘాట్ వద్ద పురోహితులపై ఆంక్షలు

విజయవాడ దుర్గఘాట్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే పురోహితులు ఆందోళనకు దిగారు. 70,80 ఏళ్ల నుంచి కృష్ణా నది దుర్గఘాట్ వద్ద పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు ఈ రోజు దుర్గఘాట్‌కు గేట్లు వేసేశారు. పురోహితులను అనుమతించలేదు. ఇక్కడ పిండప్రదానం చేయడానికి వీల్లేదని చెప్పారు. దీంతో పురోహితులు ఆందోళనకు దిగారు. నీటిపారుదల శాఖ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే పిండప్రదానం చేస్తున్నారు. హిందూధర్మంపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపుకు ఇది మరో నిదర్శనమని […]

దుర్గఘాట్ వద్ద పురోహితులపై ఆంక్షలు
X

విజయవాడ దుర్గఘాట్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే పురోహితులు ఆందోళనకు దిగారు. 70,80 ఏళ్ల నుంచి కృష్ణా నది దుర్గఘాట్ వద్ద పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు ఈ రోజు దుర్గఘాట్‌కు గేట్లు వేసేశారు.

పురోహితులను అనుమతించలేదు. ఇక్కడ పిండప్రదానం చేయడానికి వీల్లేదని చెప్పారు. దీంతో పురోహితులు ఆందోళనకు దిగారు. నీటిపారుదల శాఖ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే పిండప్రదానం చేస్తున్నారు. హిందూధర్మంపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపుకు ఇది మరో నిదర్శనమని పురోహితులు మండిపడ్డారు.

ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని ఫైర్ అయ్యారు. దాదాపు 200 మంది పురోహితులు ఇదే పని చేసుకుని బతుకుతున్నామని ఇప్పుడు గేట్లకు తాళం వేస్తే తామేమి చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు కేవలం బ్రాహ్మణులను మాత్రమే వేధిస్తున్నారో అర్థం కావడం లేదని ఒక పురోహితుడు మీడియా వద్ద వాపోయారు.

చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా తాము ఇన్ని కష్టాలు పడలేదని… ఇప్పుడు మాత్రం ఎందుకో చంద్రబాబు ప్రభుత్వం పదేపదే తమను ఇబ్బంది పెడుతోందని వాపోయారు. అయితే అధికారులు మాత్రం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఎవరూ వెళ్లకుండా ఉండేందుకే గేట్లు వేశామని చెబుతున్నారు.

First Published:  22 Sept 2018 5:50 AM IST
Next Story