జేసీ ఎపిసోడ్.... చేతులెత్తేసిన హోంమంత్రి
పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు హోంమంత్రి చినరాజప్ప. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు. ఎంపి అయి ఉండి ప్రభుత్వ వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జేసీ కోరుకున్నట్టు ప్రతి ఘటనను ఆయుధాలతో నియంత్రించలేమని చెప్పారు. ప్రజలు ఆవేశంలో ఉన్నప్పుడు పోలీసులు సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చినరాజప్ప చెప్పారు. పోలీసులను […]
పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు హోంమంత్రి చినరాజప్ప. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు.
ఎంపి అయి ఉండి ప్రభుత్వ వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జేసీ కోరుకున్నట్టు ప్రతి ఘటనను ఆయుధాలతో నియంత్రించలేమని చెప్పారు. ప్రజలు ఆవేశంలో ఉన్నప్పుడు పోలీసులు సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చినరాజప్ప చెప్పారు.
పోలీసులను తిడుతున్న జేసీపై చర్యలు ఉంటాయనా అని ప్రశ్నించగా… అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చినరాజప్ప తేల్చేశారు. సో… జేసీపై చర్యలు ఉండవన్న మాట. ప్రబోధానంద ఆశ్రమం వద్ద పోలీసులు చేతులు కట్టుకుని నిలబడడానికి… పోలీసులు సంయమనం పాటించాలన్న చంద్రబాబు ఆదేశాలే కారణమన్న మాట.