ఫేస్ బుక్ ప్రేమ.... బ్లాక్ మెయిల్.... పెళ్లి.... చివరకు చావు....
ఫేస్ బుక్ వారిద్దరినీ కలిపింది. మాటలు కలిశాయి. చివరకు ఆ పరిచయం ప్రేమగా మారింది. తన సోదరి వివాహానికి ఆహ్వానించాడు. మంచోడే కదా అని ఆ అమ్మాయి వచ్చింది. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిచ్చి.. అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకుంటే బయటపెడతానని బెదిరించాడు. అనంతరం అమ్మాయితో పెళ్లైంది. కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. ఫిర్యాదుల వరకూ వెళ్లింది. చివరకు అబ్బాయి సూసైడ్ కు దారితీసింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం […]
ఫేస్ బుక్ వారిద్దరినీ కలిపింది. మాటలు కలిశాయి. చివరకు ఆ పరిచయం ప్రేమగా మారింది. తన సోదరి వివాహానికి ఆహ్వానించాడు. మంచోడే కదా అని ఆ అమ్మాయి వచ్చింది. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిచ్చి.. అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకుంటే బయటపెడతానని బెదిరించాడు.
అనంతరం అమ్మాయితో పెళ్లైంది. కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. ఫిర్యాదుల వరకూ వెళ్లింది. చివరకు అబ్బాయి సూసైడ్ కు దారితీసింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న భర్త ఉదంతంలో పోలీసులు విచారణ జరిపితే ఎన్నో చీకటి కోణాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన శ్రీకాంత్ (25)కు నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన శ్రీహర్షకు ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సోదరి ఫంక్షన్ కు ఆహ్వానించిన శ్రీకాంత్.. శ్రీహర్షకు మత్తుమందు ఇచ్చి సృహ కోల్పోయాక అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. అనంతరం బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య ఇదే విషయంపై గొడవలు ముదరడంతో శ్రీహర్ష పుట్టింటికి వెళ్లి నల్లగొండ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత మెడికల్ సీటు రావడంతో పాలమూరు వెళ్లి కాలేజీలో చేరి చదువుతోంది.
భార్య కాలేజీకి వెళ్తుండడంతో అప్పుడప్పుడూ వెళ్లి శ్రీకాంత్ చూసి వచ్చేవాడు. ఈ క్రమంలోనే భార్య ప్రెండ్ తో పరిచయం పెంచుకొని వాట్సాప్ చాట్ చేశాడు. ఆమె నగ్న చిత్రాలు పంపాలని కోరాడు. ఆమె పంపననడంతో నాతో చాట్ చేసింది బయటపెడతానని బెదిరించాడు. 2.5 లక్షలు ఇవ్వాలంటా డిమాండ్ చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన ఫ్రెండ్ ను టార్గెట్ చేయడంపై మనస్తాపం చెందిన శ్రీహర్ష పోలీసులకు శ్రీకాంత్ పై వర్నకట్నం కేసు, విడాకుల కేసు పెట్టింది. దీనిపై పగ పెంచుకున్న శ్రీకాంత్.. భార్య నగ్న ఫొటోలను ఆమె ఉంటున్న కాలేజీ, హాస్టల్ లో అతికించాడు. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ నెల19న శ్రీహర్ష మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అదే రోజు పోలీసుల భయంతో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీకాంత్ ఆత్మహత్య వెనుక ఇంత కథ ఉందా.? ఇంత దారుణంగా వ్యవహరించాడా అని అందరూ షాక్ అయ్యారు.