కనీసం 30వేల ఓట్లతో ఓడిపోతాం....
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ముసలం బయలుదేరింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మృణాళినిపై నియోజకవర్గంలోని టీడీపీ నేతలంతా కలిసికట్టుగా తిరుగుబాటు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి వరకు వ్యవహారం వెళ్లింది. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కలిసి చంద్రబాబును అమరావతిలో కలిశారు. వచ్చే ఎన్నికల్లో మృణాళినికి టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఆమెకు కాకుండా మరెవరికి ఇచ్చినా తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామని…. లేకుంటే పార్టీ ఓటమి […]
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ముసలం బయలుదేరింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మృణాళినిపై నియోజకవర్గంలోని టీడీపీ నేతలంతా కలిసికట్టుగా తిరుగుబాటు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి వరకు వ్యవహారం వెళ్లింది.
చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కలిసి చంద్రబాబును అమరావతిలో కలిశారు. వచ్చే ఎన్నికల్లో మృణాళినికి టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఆమెకు కాకుండా మరెవరికి ఇచ్చినా తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామని…. లేకుంటే పార్టీ ఓటమి తప్పదని చంద్రబాబుకే వివరించారు.
కనీసం 30వేల ఓట్ల మెజారిటీతో చీపురుపల్లిలో టీడీపీ ఓడిపోతుందని తన ముందే పార్టీ నేతలు చెప్పడంతో చంద్రబాబు కంగుతిన్నారు. మృణాళిని భర్త గజపతిరావుపై చంద్రబాబు వద్ద పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తామంతా పార్టీ కోసం పనిచేయాలన్నా… టీడీపీ నియోజకవర్గంలో బతకాలన్నా మృణాళినికి టికెట్ ఇవ్వకూడదని నేతలు చంద్రబాబుకు చెప్పేశారు.
నియోజవకర్గంలోని నేతలంతా వచ్చి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడం, భారీ మెజారిటీతో ఆమె ఓడిపోతారని వివరించడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. మరో నాలుగైదు రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుదామని అప్పుడు రావాల్సిందిగా నేతలకు చెప్పి పంపించారు చంద్రబాబు.