ఇక కష్టమే.... బాబుకు సొంత మీడియా రిపోర్ట్?
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి సొంత మీడియా వర్గాలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రత్యేక నివేదికను అందించాయని సమాచారం. పరిస్థితి చాలా వరకూ చేయి దాటిపోయిందని…. మరోసారి అధికారం అందుకోవడం కష్టమే అని ఈ నివేదిక ద్వారా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పాయట తెలుగుదేశం అనుకూల పత్రికలు. బాబు శ్రేయస్సే పరమావధిగా పని చేసే ఈ మీడియా వర్గాలు ప్రస్తుత పరిస్థితి బాగోలేదని…. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని, మరోసారి అధికారంలోకి రావడం కూడా కష్టమే అని తేల్చి చెప్పాయని […]
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి సొంత మీడియా వర్గాలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రత్యేక నివేదికను అందించాయని సమాచారం. పరిస్థితి చాలా వరకూ చేయి దాటిపోయిందని…. మరోసారి అధికారం అందుకోవడం కష్టమే అని ఈ నివేదిక ద్వారా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పాయట తెలుగుదేశం అనుకూల పత్రికలు. బాబు శ్రేయస్సే పరమావధిగా పని చేసే ఈ మీడియా వర్గాలు ప్రస్తుత పరిస్థితి బాగోలేదని…. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని, మరోసారి అధికారంలోకి రావడం కూడా కష్టమే అని తేల్చి చెప్పాయని సమాచారం.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అంతా తనకు అనుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తరచూ చెప్పుకుంటూ ఉంటాడు. ఏకంగా 80 శాతం మంది ప్రజల్లో తనకు సానుకూలత ఉందని బాబు చెప్పుకుంటూ ఉంటాడు. ఇది తన సర్వేల్లో తేలిన అంశం అని కూడా చెబుతూ ఉన్నాడు.
అయితే వాస్తవం మాత్రం అది కాదనేది అందరికీ స్పష్టం అవుతున్న విషయమే. ఈ విషయాన్నే అనుకూల మీడియా వర్గాలు కూడా చెప్పాయట. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల దోపిడీ తీవ్ర స్థాయికి చేరిందని, కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా…. పచ్చ చొక్కా వేసుకున్న వాళ్లంతా దోపిడీ చేస్తున్నారని, జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ దోపిడీకి మార్గాలు అయ్యాయి తప్ప మరోటి కాదని ఈ మీడియా వర్గాలు నివేదికలు ఇచ్చాయట.
ఇక అమరావతి ఆర్బాటం కానీ, ఇతర ప్రచార కార్యక్రమాలు కానీ అంత ఊపును ఇవ్వడం లేదని.. వీటిని ప్రజలు పట్టించుకోవడం లేదని కూడా బాబుకు తేల్చి చెప్పాయట మీడియా వర్గాలు. ఒకవైపు చంద్రబాబు కార్యక్రమాలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లినా జనాలు రావడం లేదు. అదే జగన్ సాగిపోతుంటే చాలు ముందస్తు ఏర్పాట్లతో పని లేకుండా జనాలు క్యూ కడుతున్నారు.
ఇదంతా గమనించుకోవాల్సిన అంశమే అని చంద్రబాబు నాయుడుకు మీడియా వర్గాలు వివరించాయట. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని, ఇక కష్టమే అని కూడా తేల్చి చెప్పినట్టుగా సమాచారం.