రాజీవ్ ఖేల్ రత్నపై కోర్టుకు వెళ్తా....
అవార్డు వివాదం మరోసారి తలెత్తింది. తనను రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో రెజ్లర్ బజరంగ్ పునియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డుకు తాను అన్నివిధాలుగా అర్హుడిని అయినప్పటికి ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను కూడా తాను నిలదీశానని వివరించారు. గురువారం రాత్రి కేంద్రమంత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతిపాదించినప్పటికీ, ఖేల్ రత్న అవార్డుకు తనను ఎందుకు […]
అవార్డు వివాదం మరోసారి తలెత్తింది. తనను రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో రెజ్లర్ బజరంగ్ పునియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డుకు తాను అన్నివిధాలుగా అర్హుడిని అయినప్పటికి ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు.
ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను కూడా తాను నిలదీశానని వివరించారు. గురువారం రాత్రి కేంద్రమంత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతిపాదించినప్పటికీ, ఖేల్ రత్న అవార్డుకు తనను ఎందుకు ఎంపిక చేయలేదని తాను మంత్రిని నిలదీయగా అటువైపు నుంచి సరైన సమాధానం రాలేదన్నారు.
ఖేల్ రత్న అవార్డుకు పాయింట్లను ప్రాతిపదికగా తీసుకుంటామని మంత్రి తనతో చెప్పారని అలా తీసుకున్నా… అవార్డుకు ఎంపికైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను కంటే తనకే ఎక్కువ పాయింట్లు ఉన్నాయని పునియా వివరించారు.
తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తన పేరును తొలగించారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు జాబితాను మార్చి పునియాకు అవార్డు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర కీడా మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలా చేస్తే మరిన్ని డిమాండ్లు తెరపైకి వస్తాయని వారు అభిప్రాయపడ్డారు.