Telugu Global
NEWS

ఆసియాకప్ లో నాలుగుస్తంభాలాట

సూపర్ ఫోర్ సమరం షురు గ్రూప్ లీగ్ టాపర్లుగా టీమిండియా, అప్ఘనిస్థాన్ 28న ఆసియాకప్ టైటిల్ సమరం ఆసియాకప్ లో ఆరుజట్ల గ్రూప్ లీగ్ ముగియడంతోనే…. నాలుగుజట్ల సూపర్ ఫోర్ రౌండ్ కు తెరలేచింది. గ్రూప్ లీగ్ మొదటి రెండు స్థానాలలో నిలిచిన టీమిండియా, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు.. నాలుగు స్తంభాలాటలో ఆధిపత్యానికి తహతహలాడుతున్నాయి… టాపర్లుగా టీమిండియా, అప్ఘనిస్థాన్… యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా… గతవారం రోజులుగా జరుగుతున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నీ లో తొలిదశ […]

ఆసియాకప్ లో నాలుగుస్తంభాలాట
X
  • సూపర్ ఫోర్ సమరం షురు
  • గ్రూప్ లీగ్ టాపర్లుగా టీమిండియా, అప్ఘనిస్థాన్
  • 28న ఆసియాకప్ టైటిల్ సమరం

ఆసియాకప్ లో ఆరుజట్ల గ్రూప్ లీగ్ ముగియడంతోనే…. నాలుగుజట్ల సూపర్ ఫోర్ రౌండ్ కు తెరలేచింది. గ్రూప్ లీగ్ మొదటి రెండు స్థానాలలో నిలిచిన టీమిండియా, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు.. నాలుగు స్తంభాలాటలో ఆధిపత్యానికి తహతహలాడుతున్నాయి…

టాపర్లుగా టీమిండియా, అప్ఘనిస్థాన్…

యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా… గతవారం రోజులుగా జరుగుతున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నీ లో తొలిదశ గ్రూప్ లీగ్ సమరం ముగియడంతోనే… నాలుగు అగ్రశ్రేణి జట్ల… నాలుగు స్తంభాలాటకు తెరలేచింది. దుబాయ్, అబూదాబీ వేదికలుగా జరిగిన…

గ్రూప్-ఏ, గ్రూప్- బీ రౌండ్ పోటీలలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, సంచలనాల అప్ఘనిస్థాన్ ,మాజీ చాంపియన్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా… సూపర్ ఫోర్ రౌండ్ కు అర్హత సంపాదించాయి. ఐదుసార్లు విజేత శ్రీలంక, పసికూన హాంకాంగ్ జట్లు మాత్రం… గ్రూప్ లీగ్ దశ నుంచే నిష్క్రమించాయి.

సంచలనాల అప్ఘనిస్థాన్…

శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ జట్లతో కూడిన.. గ్రూప్ -ఏ లీగ్ లో 10వ ర్యాంకర్ అప్ఘని స్థాన్ సంచలన విజయాలతో టాపర్ గా నిలిచింది. తొలిమ్యాచ్ లో శ్రీలంకను, మలిమ్యాచ్ లో బంగ్లాదేశ్ ను అప్ఘనిస్థాన్ చిత్తు చేసి… ఆసియా క్రికెట్ నయాపవర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

ఇక… చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, పసికూన హాంకాంగ్ జట్లు ప్రత్యర్థులుగా ఉన్న గ్రూప్ – బీ లీగ్ లో… ప్రస్తుత చాంపియన్ టీమిండియా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో… టాపర్ హోదాలో సూపర్ ఫోర్ రౌండ్లో అడుగుపెట్టింది

దాయాదుల మరో సమరం…

సూపర్ ఫోర్… రెండోరౌండ్లో ఈనెల 23 న జరిగే పోటీలో… చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాక్ జట్లు తలపడతాయి. మరోపోటీలో అప్ఘనిస్థాన్ తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈనెల 25న జరిగే మూడో రౌండ్ పోటీలో టీమిండియాతో అప్ఘనిస్థాన్ తలపడుతుంది. 26 న జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ పోటీపడతాయి.

28న టైటిల్ ఫైట్….

సూపర్ ఫోర్ రౌండ్ మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈనెల 28న జరిగే టైటిల్ సమరంతో…. 2018 ఆసియాకప్ కు తెరపడుతుంది. ఈ నాలుగు స్తంభాలాటలో… ఏ రెండుజట్లు ఫైనల్స్ చేరేది తెలుసుకోవాలంటే… మరి కొద్దిరోజుల పాటు సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  22 Sept 2018 1:56 AM IST
Next Story