ముస్లిం,దళిత, గిరిజనులకు పేదరికం నుంచి విముక్తి
భారతదేశంలో అట్టడుగున ఉన్నకొన్నివర్గాలు పేదరికాన్ని జయించాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ నివేదిక స్పష్టం చేసింది. 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారతదేశం పేదరికాన్ని ఎదుర్కోవడంలో ముందంజ వేసిందని…జనాభాలోని ముస్లిం మతస్థులు, దళితులు, గిరిజనులు మరింత అభివృద్ధి సాధించారని యూఎన్ నివేదిక వివరించింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వివరాలు వెల్లడైన సందర్భంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ […]
భారతదేశంలో అట్టడుగున ఉన్నకొన్నివర్గాలు పేదరికాన్ని జయించాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ నివేదిక స్పష్టం చేసింది. 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారతదేశం పేదరికాన్ని ఎదుర్కోవడంలో ముందంజ వేసిందని…జనాభాలోని ముస్లిం మతస్థులు, దళితులు, గిరిజనులు మరింత అభివృద్ధి సాధించారని యూఎన్ నివేదిక వివరించింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వివరాలు వెల్లడైన సందర్భంగా ఈ విషయాలు వెలుగు చూశాయి.
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (OPHDI) సంయుక్తంగా రూపొందించాయి. ఆరోగ్యం, విద్య, క్లీన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, న్యూట్రిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇన్‌డెక్స్ (MPI)ను గణించారు.
27 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి…
భారతదేశంలో 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో దాదాపు 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (OPHDI) డేటా చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 36.4 కోట్ల మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బీహార్ కొనసాగుతోంది. ఆ జాబితాలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాలు పేదరికం నుంచి విముక్తి పొందుతున్నప్పటికీ ఈ రాష్ట్రాలు మాత్రం ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయి.