Telugu Global
NEWS

వద్దనుకున్న సరుకంతా జనసేనలోకి...

ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారి విషయంలో, పార్టీలు మారే వారి విషయంలో జనసేన జాగ్రత్తగా ఉంటుందని పవన్‌ కల్యాణ్ చెబుతూ వచ్చారు. అలాంటి జంపింగ్ రాజకీయాలు చేసే వారిని కాకుండా కొత్తగా, స్వచ్చమైన వారికి జనసేన ఆహ్వానం పలుకుతుందని పవన్‌ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. టీడీపీ, వైసీపీలో టికెట్లు సాధించలేని వారే జనసేన వైపు క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. […]

వద్దనుకున్న సరుకంతా జనసేనలోకి...
X

ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారి విషయంలో, పార్టీలు మారే వారి విషయంలో జనసేన జాగ్రత్తగా ఉంటుందని పవన్‌ కల్యాణ్ చెబుతూ వచ్చారు. అలాంటి జంపింగ్ రాజకీయాలు చేసే వారిని కాకుండా కొత్తగా, స్వచ్చమైన వారికి జనసేన ఆహ్వానం పలుకుతుందని పవన్‌ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు.

టీడీపీ, వైసీపీలో టికెట్లు సాధించలేని వారే జనసేన వైపు క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. టీడీపీ నుంచి పలువురు జనసేనలోకి క్యూ కడుతున్నారు. అయితే వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి.. చంద్రబాబు చేత నో అనిపించుకున్న వారే కావడం విశేషం. టీటీడీ మాజీ చైర్మన్‌ చదల‌వాడ కృష్ణమూర్తి హైదరాబాద్‌లో పవన్‌ ను కలిశారు. జనసేనలో చేరుతున్నట్టు చెప్పారు.

చదల‌వాడ కృష్ణమూర్తికి ఇటీవల చంద్రబాబు ప్రాధాన్యత తగ్గించేశారు. వచ్చే ఎన్నికల్లో చదల‌వాడకి టికెట్ దక్కే అవకాశం లేదు. అందుకే పవన్‌ కల్యాణ్ వద్దకు చేరినట్టు చెబుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పేశారు. దీంతో ఆమె కూడా జై జనసేన అంటున్నారు. ఇటీవల చంద్రబాబు తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ సుగుణమ్మ కనిపించలేదు.

వచ్చే ఎన్నికల్లో మదనపల్లి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌కు చంద్రబాబు ఖాయం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ నరేష్‌ కుమార్ రెడ్డి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. పీలేరు టికెట్‌ను మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్‌ రెడ్డికి చంద్రబాబు ఖాయం చేయడంతో అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇక్బాల్ అహ్మద్‌ కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇలా టీడీపీలో టికెట్‌ రాదని తెలుసుకుని జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్న వారంతా అటు వైసీపీలోకి వెళ్లి అక్కడ టికెట్లు సాధించేంత స్టామినా లేని వారే కావడం విశేషం. దీంతో వారంతా జనసేన వెంటపడుతున్నారు. ఇలా ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వకుండా తిరస్కరించిన వారిని పార్టీలోకి చేర్చుకుంటే దాని వల్ల లాభం కంటే నష్టమే అధికమని జనసేన వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. కాకపోతే పార్టీలోకి ఇతర పార్టీల వారు వస్తున్నారన్న ఫీల్‌ కలిగించేందుకైనా సర్దుకుపోక తప్పదంటున్నారు.

First Published:  21 Sept 2018 4:26 AM IST
Next Story