పరుగుకో వికెట్...నదీమ్ ప్రపంచ రికార్డు
భారత దేశవాళీ క్రికెట్లో… జార్ఖండ్ లైఫ్టామ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పాడు. కేవలం 10 ఓవర్లలోనే 10 పరుగులిచ్చి 8 వికెట్లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ తో… చెన్నై వేదికగా ముగిసిన పోటీలో నదీం విశ్వరూపం ప్రదర్శించాడు. నదీమ్ స్పిన్ మ్యాజిక్ తో… రాజస్థాన్ 28.3 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో జార్ఖండ్ 7 వికెట్ల అలవోక […]
భారత దేశవాళీ క్రికెట్లో… జార్ఖండ్ లైఫ్టామ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పాడు.
కేవలం 10 ఓవర్లలోనే 10 పరుగులిచ్చి 8 వికెట్లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ తో… చెన్నై వేదికగా ముగిసిన పోటీలో నదీం విశ్వరూపం ప్రదర్శించాడు.
నదీమ్ స్పిన్ మ్యాజిక్ తో… రాజస్థాన్ 28.3 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో జార్ఖండ్ 7 వికెట్ల అలవోక విజయం సాధించగలిగింది. 1997- 98 సీజన్లో ఢిల్లీ స్పిన్నర్ రాహుల్ సంఘ్వీ నెలకొల్పిన 15 పరుగులకే 8 వికెట్ల రికార్డును…రెండుదశాబ్దాల విరామం తర్వాత…. షాబాజ్ నదీమ్ తెరమరుగు చేశాడు.
నదీమ్ సాధించిన ఈ ప్రపంచ రికార్డులో ఓ హ్యాట్రిక్ సైతం ఉండటం విశేషం. ఇప్పటి వరకూ తన కెరీర్ లో 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన 29 ఏళ్ల నదీమ్ కు… 375 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. జార్ఖండ్ తరపున క్రికెట్ మొత్తం నాలుగు ఫార్మాట్లలోనూ నదీమ్ నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని సైతం ఆకర్షించ గలిగాడు.