జేసీపై మీసం తిప్పిన పోలీసు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసుల సంఘం మండిపడింది. ప్రబోధానంద ఆశ్రమం వద్ద పోలీసుల తీరును తప్పుపట్టిన జేసీ దివాకర్ రెడ్డి… పోలీసుల కంటే హిజ్రాలు నయమని వ్యాఖ్యానించారు. ఇందుకు పోలీసు అధికారుల సంఘం స్పందించింది. సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్… జేసీకి హెచ్చరికలు జారీ చేశారు. తాము మగాళ్లం కాబట్టే పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చామని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాగే మాట్లాడితే నాలుక చీరేస్తామన్నారు. ఫ్రెండ్లీ […]
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసుల సంఘం మండిపడింది. ప్రబోధానంద ఆశ్రమం వద్ద పోలీసుల తీరును తప్పుపట్టిన జేసీ దివాకర్ రెడ్డి… పోలీసుల కంటే హిజ్రాలు నయమని వ్యాఖ్యానించారు. ఇందుకు పోలీసు అధికారుల సంఘం స్పందించింది. సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్… జేసీకి హెచ్చరికలు జారీ చేశారు.
తాము మగాళ్లం కాబట్టే పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చామని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాగే మాట్లాడితే నాలుక చీరేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఇంతవరకు సంయమనం పాటించామని.. ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. మీడియా సమావేశంలో గోరంట్ల మాధవ్ మీసం మెలేశారు. నాయకుల మాటలతో తాము ఇళ్లలో భార్య పిల్లలకు ముఖాలు చూపించలేకపోతున్నామని పోలీసుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు… జేసీపై ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన స్టీపెన్ రవీంద్ర… మీ ఇంటికి వచ్చి తరిమిన విషయం మరిచిపోయారా అని పరోక్షంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు.