చంద్రబాబు.. ఆర్భాట చక్రవర్తే.. ఈ ఒక్క ఉదాహరణ చాలు..
ఆర్భాట చక్రవర్తి.. ఈ పదం చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఆయనలా పేరు గొప్ప.. ఊరుదిబ్బలా ఎవ్వరూ ప్రవర్తించరనే విమర్శ రాజకీయాల్లో ఉంది. ఏదైనా ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తర్వాత గాలికొదిలేయడం ఆయన నైజంగా కనిపిస్తోంది. ఇప్పుడూ అదే జరిగింది.. చంద్రబాబు ఆకర్షక పథకాల్లో ఒకటైన విలేజ్ మాల్స్ ప్రజలను ఆకర్షించలేకపోయింది. ప్రారంభించిన ఏడాదికే మూత దిశగా మాల్స్ పయనిస్తున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలు పడిన డీలర్లకు లాభం రాకపోగా తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా తిరిగి […]
ఆర్భాట చక్రవర్తి.. ఈ పదం చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఆయనలా పేరు గొప్ప.. ఊరుదిబ్బలా ఎవ్వరూ ప్రవర్తించరనే విమర్శ రాజకీయాల్లో ఉంది. ఏదైనా ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తర్వాత గాలికొదిలేయడం ఆయన నైజంగా కనిపిస్తోంది. ఇప్పుడూ అదే జరిగింది..
చంద్రబాబు ఆకర్షక పథకాల్లో ఒకటైన విలేజ్ మాల్స్ ప్రజలను ఆకర్షించలేకపోయింది. ప్రారంభించిన ఏడాదికే మూత దిశగా మాల్స్ పయనిస్తున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలు పడిన డీలర్లకు లాభం రాకపోగా తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని లబోదిబోమంటున్నారు. మూడు నెలలుగా రిలయన్స్ సంస్థ సరుకుల సరఫరా నిలిపివేసింది. డీలరు కమిషన్, సరుకుల సరఫరా ఒప్పందం విషయమై ఒక స్పష్టమైన విధానం అవలంబించకపోవడం శాపంగా మారింది.
గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా విలేజ్ మాల్స్ ను ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టుగా క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. డీలర్లకు ముద్ర ద్వారా రుణం అందిస్తామనడంతో డీలర్లు రూ.50 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. ఓ ఏజెన్సీని ప్రారంభించి, రిలయన్స్ సంస్థ ద్వారా సరుకులు సరఫరా జరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ముందుగా డీలర్ కు 8 శాతం కమీషన్ ఇస్తామన్నారు. ఆ ప్రకారం ఒక్కో డీలరు కు సుమారుగా రూ.25 వేల వరకు నెలకు లాభం వచ్చింది. దాంతో డీలర్ కమీషన్ ను సగానికి తగ్గించారు. ఆ తరువాత ఎమ్మార్పీలో లాభం ఉండేలా సరుకులు సరఫరా చేశారు. సహజంగా బియ్యం, కందిపప్పుపై జీఎస్టీ లేదు. ప్యాకింగ్ చేసి ఇవ్వడం వల్ల జీఎస్టీ పడుతుంది. పైగా ప్యాకింగ్ ఖర్చుకు అదనంగా రూ.4 వరకు చెల్లించాలి. ఆ లెక్కన ధరలు బయట మార్కెట్ కంటే ఎక్కువగా విక్రయించాల్సి వచ్చింది. దీంతో జనాలు అటువైపు రావడం మానేశారు. ఇలా డీలర్లకు ప్రయోజనం లేకుండా పోయింది.
సరుకులు లూజుగా ఇచ్చినా ఎంతో కొంత లాభం చూసుకునే వారమని ఓ డీలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు నెలలుగా అసలు సరుకులు కూడా మాల్స్ కు సరఫరా కావడం లేదు. ఈ విషయాన్ని ఎన్ని సార్లు పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని డీలర్లు వాపోతున్నారు. పెట్టుబడి తిరిగి రాకపోగా, నెలసరి అద్దెలు కట్టుకోలేక సతమతమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు పథకాలతో మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అస్పష్ట విధానాలతో జనాలను ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటున్నారు.