Telugu Global
NEWS

ఏపీలో సరికొత్త రాజకీయం.. జగన్ కు ప్లస్.? మైనస్.?

ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కంటే ఏపీలో ఫైట్ వాడివేడిగా ఉంది. అక్కడ చంద్రబాబుకు అసలు సిసలు ప్రత్యర్థి వైఎస్ జగన్ రూపంలో ఉన్నాడు. బలమైన ప్రతిపక్షం ఉండడం.. వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ తప్పదని భావిస్తున్నారు. తాజా సర్వే రిపోర్టుల్లో వైఎస్ జగన్ కు కాస్త మొగ్గు కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి ఎవరు గెలుస్తారు? ఎవరు ముందంజ అనేది తెలుస్తుంది. కాగా ఇప్పటికే నాయకులు, ప్రజలు టీడీపీ, వైసీపీ మద్దతుదారులుగా విడిపోయారు.. తాజాగా […]

ఏపీలో సరికొత్త రాజకీయం.. జగన్ కు ప్లస్.? మైనస్.?
X

ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కంటే ఏపీలో ఫైట్ వాడివేడిగా ఉంది. అక్కడ చంద్రబాబుకు అసలు సిసలు ప్రత్యర్థి వైఎస్ జగన్ రూపంలో ఉన్నాడు. బలమైన ప్రతిపక్షం ఉండడం.. వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ తప్పదని భావిస్తున్నారు. తాజా సర్వే రిపోర్టుల్లో వైఎస్ జగన్ కు కాస్త మొగ్గు కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి ఎవరు గెలుస్తారు? ఎవరు ముందంజ అనేది తెలుస్తుంది.

కాగా ఇప్పటికే నాయకులు, ప్రజలు టీడీపీ, వైసీపీ మద్దతుదారులుగా విడిపోయారు.. తాజాగా మేధావి వర్గం కూడా వైసీపీ బాట పడుతుండడం ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి మాజీ అధికారులు క్యూ కట్టారు. మొన్న మాజీ డీజీపీ సాంబశివరావు జగన్ ని కలిసారు… తాజాగా మాజీ డీఐజీ ఏసురత్నం వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన చేసిన ఆయన ఈ నెల 22న విజయనగరంలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వడ్డెర వర్గానికి చెందిన ఆయన ఆ వర్గ అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు.

ఈ అధికారులంతా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్య అధికారులుగా చెలామణి అయినవారే. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైసీపీలోకి చేరుతున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఐవైఆర్ క్రిష్ణారావు ఉద్యోగ విరమణ తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీలో కులస్వామ్యం పెరిగిపోయిందని, టీడీపీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు రిటైర్మెంట్ ఇవ్వడం తప్పన్నారు. ఇందుకు ఆయనపై వేటు పడింది. టీడీపీకి దూరమైన ఆయన బీజేపీలో చేరి టీడీపీకి వ్యతిరేకిగా మారిపోయారు. అధికారులు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేశారు.

తాజాగా ఏసురత్నం చేరిక వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంది. ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు వడ్డెర్ల గురించి పట్టించుకోలేదని, జగన్ చట్ట సభల్లో ప్రాధాన్యం కల్పిస్తానని అనడం హర్షణీయమని అన్నారు. గుంటూరు జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని ఇప్పటికే వడ్డెర్ల కోసం జగన్ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా మేధావి వర్గం అధికారులు వరుసగా వైసీపీ బాటపడుతుండడం ఆ పార్టీకి బలం చేకూరుస్తోంది.

First Published:  20 Sept 2018 11:27 AM IST
Next Story