సీతారామన్ రాజీనామాకు రాహుల్ పట్టు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ డీల్‌పై విమర్శలు జోరు పెంచారు. ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ అధిపతి టిఎస్ రాజు రాఫెల్ విషయంలో కొన్ని అంశాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను నిర్మించే సత్తా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థకు ఉందని అన్నారు. 25 టన్నుల […]
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ డీల్‌పై విమర్శలు జోరు పెంచారు. ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే పదవీ విరమణ చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ అధిపతి టిఎస్ రాజు రాఫెల్ విషయంలో కొన్ని అంశాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను నిర్మించే సత్తా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థకు ఉందని అన్నారు. 25 టన్నుల సుఖాయ్ ఫైటర్ జెట్ల్ ను నిర్మించగలిగిన తాము రాఫెల్ యుద్ధ విమానాలు ఎందుకు నిర్మించలేం ? అంటూ ప్రశ్నించారు.
టిఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ మరింత పదునైన విమర్శలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ చాలా విషయాల్లో అసత్యాలు చెబుతున్నారంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
యూపీఏ పాలన కారణంగానే… హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే అవకాశం కోల్పోయిందని నిర్మలా సీతారామన్ గతంలో ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. మాజీ రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ కూడా నిర్మలా సీతారామన్ తీరును తప్పుబట్టారు. నిజాలను దాచివేస్తున్నారని మండిపడ్డారు.