ఆహారంలో " ఖనిజ లవణాలు
ఖనిజ లవణాలు: ఇవి దాదాపు అన్ని ఆహారపదార్థాలలోనూ లభిస్తాయి. స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలుగానూ విభజించవచ్చు. వీటి లోటు వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మోతాదును మించి వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. స్థూల పోషక పదార్థాలు కేల్షియం (సున్నం) ఎముకలు, పలు వరుసల నిర్మాణంలో ప్రధానమైంది. రక్తం గడ్డకట్టడంలో సహాయ పడుతుంది. గుండె కండరాలు నిరంతరం చలించే క్రియలో తోడ్పడుతుంది. దీని లోపం వల్ల పిల్లలలో ఎదుగుదల అంతగా ఉండదు. […]
ఖనిజ లవణాలు: ఇవి దాదాపు అన్ని ఆహారపదార్థాలలోనూ లభిస్తాయి. స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలుగానూ విభజించవచ్చు. వీటి లోటు వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మోతాదును మించి వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
స్థూల పోషక పదార్థాలు
కేల్షియం (సున్నం)
ఎముకలు, పలు వరుసల నిర్మాణంలో ప్రధానమైంది. రక్తం గడ్డకట్టడంలో సహాయ పడుతుంది. గుండె కండరాలు నిరంతరం చలించే క్రియలో తోడ్పడుతుంది. దీని లోపం వల్ల పిల్లలలో ఎదుగుదల అంతగా ఉండదు. పేరా థైరాయిడ్ గ్రంథి సమర్థత తగ్గుతుంది. ఎముకలు బలహీన పడతాయి. నరాల ఉద్వేగం కనబడవచ్చు. కండరాలు వాటంతట అవే కంపించటం, చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు చిట్లడం, విరిగిపోవడం జరగవచ్చు. ఇది పాలు, పాల సంబంధమైన అన్ని పదార్థాలలోను విరివిగా లభిస్తుంది. నూనె గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి, సజ్జలు వంటి చిరు ధాన్యాలలోనూ, మునగ, పాలకూర, టొమాటోలలోనూ, కాయగూరలు, ఆకు కూరలు, పండ్లలోనూ లభిస్తుంది.
భాస్వరం (ఫాస్పరస్)
కాల్షియంతో కలిసి పలువరుస, ఎముకలు, గోళ్లు, శిరోజాల నిర్మాణంలోను ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోడియం ఫాస్పేట్, పొటాషియం ఫాస్పేటు రూపాలలో జీవకణంలోని ద్రవాలలో ఉంటుంది. కొవ్వు శరీరంలోని అన్ని భాగాలకు అందించడంలో దీని ప్రాముఖ్యం ఉంది. జీవకణం న్యూక్లియోప్రొటీన్‌లో భాస్వరం ఉంటుంది. భాస్వరం లోపం వల్ల కేల్షియం సక్రమంగా వినియోగపడదు. అంచేత కేల్షియం లోపం వల్ల వచ్చే నష్టాలు భాస్వర లోపం వల్ల కూడా వస్తాయని గుర్తించాలి. ధాన్యాలు, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, బాదం పప్పు, జీడిపప్పు వగైరాలలోను, నూనె గింజలలోను, పాలు, గుడ్లలోను భాస్వరం లభిస్తుంది.
మెగ్నీషియం
ఇది శరీరంలోని కొన్ని ఎంజైములలో ఉంటుంది. శరీరంలో జరిగే ఆక్సిడేషన్‌లో దీని పాత్ర చాలా ముఖ్యం. (గ్లూకోజు కణాన్ని విభజించి శక్తిని విడుదల చెయ్యడం). దీని లోపం వల్ల కండరాల బలహీనత, కళ్లు తిరగడం, కాళ్లు, చేతులు వణకడం జరగవచ్చు. డిప్రెషన్‌కు కూడా కొంత వరకు కారణం కావచ్చు.
చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బాదం పప్పు, జీడిపప్పు, వగైరాలలోనూ, నూనె గింజలలోను (వేరుశనగతో సహా) లభిస్తుంది. పాలు, గుడ్లు, మాంసంలో ఎక్కువగా లభిస్తుంది.
సోడియం
శరీరంలో ఆమ్ల, క్షార సమతౌల్యాన్ని కాపాడుతుంది. శరీర కణాల్లో ద్రవ సాంద్రతను నియంత్రిస్తుంది. గుండె కొట్టుకోవడాన్ని కూడా నియంత్రిస్తుంది. దీని లోపం అనే సమస్య ఉండదు. మనం తినే ఆహార పదార్థాలన్నింటిలోనూ సోడియం ఎంతో కొంత లభిస్తుంది. అది దరిదాపు మనకు సరిపోతుంది. అదనంగా తీసుకోవలసిన అవసరం లేదు.
ప్రస్తుతం ఉప్పు వల్ల కలిగే లాభాల కంటే నష్టాలు వివరంగా తెలుసుకోవాలి. సోడియం అధికం కావడం వల్ల రక్తపోటు అధికం కావడం, కాళ్లకు నీరు పట్టడం వంటివి కలుగుతాయి. రక్తపోటు అధికం కావడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అంచేత ఉప్పు వీలైనంత తక్కువ తినడం అలవాటు చేసుకోవాలి.
పొటాషియం
ఎర్రకణాలలో (రక్తంలో) ఉంటుంది. జీవకణంలోని ద్రవం పి. హెచ్‌ని నియంత్రిస్తుంది. (పి.హెచ్. ఆమ్ల క్షార ద్రవసాంద్రతను తెలిపే సూచిక. 7 అంటే తటస్థస్థితి. తక్కువ ఉంటే ఆమ్ల స్థితి అనీ, ఎక్కువ ఉంటే క్షార స్థితి అనీ అంటారు. నిమ్మరసం 1పి.హెచ్. కాని 2పి.హెచ్ గాని ఉంటుంది. డిస్టిల్డ్ వాటర్‌కి ఉప్పు కలిపితే పి.హెచ్. 8,9 అలా పెరుగుతుంది. ఉప్పు కరిగిన నీరు 13-14 అలా ఉండవచ్చు. ఇది క్షార లక్షణం అంటారు) గుండె ఇతర కండరాలలోను పొటాషియం ఉంటుంది. దీని లోపం వల్ల కండరాలు పక్షవాతానికి గురి అవుతాయి. ఇది ఎక్కువైతే కండరాలు బలహీన పడవచ్చు.
సజ్జలు, గోధుమలు, మొక్కజొన్నలలోను, చిక్కుడు జాతి కూరగాయలలోను, ఇతర కూరగాయలలోను, బాదం పప్పు, జీడిపప్పు వంటి పప్పులలోను, నూనె గింజలలోను, పండ్లలోను విరివిగా లభిస్తుంది. 100 గ్రాముల కాఫీలో 2020 మి.గ్రా, టీలో 2160 మి.గ్రా, కోకోలో 1522 మి.గ్రా పొటాషియం లభిస్తుంది.
ఇనుము
హెమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల నుండి గ్రహించడం ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తుంది. హెమోగ్లోబిన్‌లో ఇనుము ఒక ముఖ్య భాగం. ఇటీవల పిల్లల్లోను, విద్యార్థులలోను ముఖ్యంగా బాలికలలోను, గర్భిణీ స్త్రీలలోను, సహజంగా స్త్రీలలోను ఇనుము లోటు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ లోటు చాలాకాలం ఉంటే ఆరోగ్యం అస్తవ్యస్తం అవుతుంది. ఎర్రకణాల సంఖ్య సాంద్రతవల్ల కూడా ఈ లోటు తెలుస్తుంది.
ఇనుము అధికం అయితే లీవర్ గట్టిపడడం, చర్మం రంగు కోల్పోవడం కూడా కలుగవచ్చు. ఇది చిరుధాన్యాలలోను (బాజ్రాలో ఎక్కువ), ఆకు కూరలలోను, నూనె గింజలలోను, బెల్లంలోను సమృద్ధిగా లభిస్తుంది. పొట్టుతో ఉన్న అన్ని పప్పులలోనూ, డ్రైఫ్రూట్స్‌లోనూ తగినంత లభిస్తుంది. వైద్యుల సలహా లేకుండా మాత్రలు, సిరప్‌లు వాడడం మంచిది కాదు.