Telugu Global
NEWS

తెలంగాణలో నయాజాఢ్యం.. ప్రాణాలు తీస్తోంది..

కుల కుంపట్లు తెలంగాణలో పెచ్చరిల్లుతున్నాయి. నిజానికి రజకార్ల పాలనలో అణిగిపోయిన తెలంగాణ జనాలు వారిపై పోరుబాటలో కలిసి పనిచేశారు. ఇప్పటికీ తెలంగాణ ఊళ్లల్లో అన్ని కులాల వారు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటూ కనిపిస్తారు. ఆప్యాయంగా ఆదరించుకుంటారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో కుల కుంపట్లు చాలా తక్కువ అని ప్రచారంలో ఉంది. ఏపీలో కొన్ని సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. వారే అధికారం కోసం కులాల కుంపట్లను రాజేసి లబ్ధి పొందుతూ వస్తున్నారు. కులాలను బట్టి ఉద్యోగాలు కూడా పొందిన […]

తెలంగాణలో నయాజాఢ్యం.. ప్రాణాలు తీస్తోంది..
X

కుల కుంపట్లు తెలంగాణలో పెచ్చరిల్లుతున్నాయి. నిజానికి రజకార్ల పాలనలో అణిగిపోయిన తెలంగాణ జనాలు వారిపై పోరుబాటలో కలిసి పనిచేశారు. ఇప్పటికీ తెలంగాణ ఊళ్లల్లో అన్ని కులాల వారు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటూ కనిపిస్తారు. ఆప్యాయంగా ఆదరించుకుంటారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో కుల కుంపట్లు చాలా తక్కువ అని ప్రచారంలో ఉంది. ఏపీలో కొన్ని సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. వారే అధికారం కోసం కులాల కుంపట్లను రాజేసి లబ్ధి పొందుతూ వస్తున్నారు. కులాలను బట్టి ఉద్యోగాలు కూడా పొందిన వారు ఏపీలో ఉన్నారు. అంతటి కులజాఢ్యం ఇప్పుడు తాజాగా తెలంగాణకు పాకింది. మనుషుల ప్రాణాలు తీసే వరకూ సాగుతోంది. ఎక్కడిదీ నయా వికృత క్రీడ.?

మొన్నీ మధ్య మిర్యాలగూడలో దారుణం జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న అగ్రకుల అమ్మాయిపై ఆ అమ్మాయి తండ్రే కత్తికట్టాడు. పరువు కోసం అల్లుడి ప్రాణాలు తీశాడు. ఆ సమయంలో ఆయన కూతురు గురించి.. కూతురి జీవితం గురించి ఆలోచించలేదు. కేవలం పరువు.. పరువు.. అదే కల్లముందే కదలాడింది. తక్కువ కులం అని యువకుడి ప్రాణాలను తీసేశాడు. ఇందుకోసం ఐదు సార్లు స్కెచ్ గీయడం కూడా దిగ్బ్రాంతికి గురిచేసింది.

తాజాగా హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో దారుణం జరిగింది. సందీప్ అనే ఎస్సీ మాల వర్గానికి చెందిన యువకుడిని తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన మనోహరచారి యువకుడిని.. అడ్డువచ్చిన కూతురిని కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికేశాడు. కులాలు వేరు కావడం.. కూతురు ఎస్సీని చేసుకుందని అవమానపడ్డ మనోహరచారి ఈ పరువు హత్యకు దిగాడు. ఈనెల 12న వివాహం జరగ్గా.. 8 రోజులకే వీరి ప్రేమ కథ అంతిమ దశకు వచ్చింది. ప్రస్తుతం కూతురు చేతి మడిమ నరాలు తెగి రక్తం పోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అల్లుడు కూడా తీవ్రగాయాలపాలయ్యాడు.

ఇలా తెలంగాణలోనూ కుల పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. పరువు కోసం పంతాలకు పోయి ప్రాణాలు తీస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, పట్టింపులు ఈ హత్యకు దారి తీస్తున్నాయి. సమాజం ఆధునిక వ్యవహారశైలితో ముందుకు పోతుంటే కుల నిర్మూలన జరగాలి కానీ.. ఇంకా ఎక్కువవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కులాల కట్టుబాట్లు ఎప్పుడు రూపుమాపుతాయో…

First Published:  20 Sept 2018 6:22 AM IST
Next Story