సై రా" ని ప్రొడ్యూస్ చేయనున్న మరో నిర్మాత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో గత ఏడాది “ఖైది నెంబర్ 150” సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ఆ సినిమా తరువాత మళ్ళి ఇప్పుడు “సై రా నరసింహ రెడ్డి” అంటూ ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా పై అంచనాలలు ఉండటం భారీగా బడ్జెట్ కూడా పెరిగింది. పేరున్న టెక్నీషియన్లు, నటులు వచ్చి చేరడం, చిత్రీకరణ ఆలస్యం అవుతుండడం, వర్కింగ్ డేస్ పెరుగుతుండడంతో బడ్జెట్ కూడా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో గత ఏడాది “ఖైది నెంబర్ 150” సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ఆ సినిమా తరువాత మళ్ళి ఇప్పుడు “సై రా నరసింహ రెడ్డి” అంటూ ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా పై అంచనాలలు ఉండటం భారీగా బడ్జెట్ కూడా పెరిగింది. పేరున్న టెక్నీషియన్లు, నటులు వచ్చి చేరడం, చిత్రీకరణ ఆలస్యం అవుతుండడం, వర్కింగ్ డేస్ పెరుగుతుండడంతో బడ్జెట్ కూడా పెరుగుతూ పోయింది.
ఇప్పుడు “సైరా” బడ్జెట్ రూ.200 కోట్ల దగ్గర ఆగింది. రూ.200 కోట్లు పెట్టగలిగే సత్తా చరణ్‌లో ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చరణ్ వేరే పనుల్లో కూడా బిజీగా ఉండటం తో ఇప్పుడు వేరే నిర్మాత కూడా ఈ సినిమాలో భాగమట. ఆయనే డి.వి.వి. దానయ్య. రామ్ చరణ్ చరణ్ బోయపాటి చిత్రానికి దానయ్య నిర్మాత. ఆయన సైడ్ నుంచి “సైరా”కి పెట్టుబడి పెడుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అయితే “సైరా” బిజినెస్ మొదలయ్యాక ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారా, లేదంటే దానయ్య పేరు కూడా ప్రొడ్యూసర్స్ గా పేరు వేస్తారా అనే దాంట్లో క్లారిటీ లేదు.