Telugu Global
National

ఈమె ప్రపోజల్‌ను రాహుల్‌ పట్టించుకోలేదట....

రాములమ్మ…. సినిమాల్లో ఫైర్ బ్రాండ్…. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే…. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నంబర్ 2. కేసీఆర్ తర్వాత అంతటి పేరు, పలుకుబడి ఉన్న నేత ఆమె. కానీ ఎందుకో పడలేదు. కేసీఆర్ వైఖరి నచ్చక కాంగ్రెస్ లో చేరారు. చేరినప్పుడు ఎర్రతివాచీ పరిచిన కాంగ్రెస్ కండువాలు…. ఆ తర్వాత కాంగ్రెస్ మహాసముద్రం లాంటి పార్టీలో ఆమె ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి […]

ఈమె ప్రపోజల్‌ను రాహుల్‌ పట్టించుకోలేదట....
X

రాములమ్మ…. సినిమాల్లో ఫైర్ బ్రాండ్…. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే…. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నంబర్ 2. కేసీఆర్ తర్వాత అంతటి పేరు, పలుకుబడి ఉన్న నేత ఆమె. కానీ ఎందుకో పడలేదు. కేసీఆర్ వైఖరి నచ్చక కాంగ్రెస్ లో చేరారు. చేరినప్పుడు ఎర్రతివాచీ పరిచిన కాంగ్రెస్ కండువాలు…. ఆ తర్వాత కాంగ్రెస్ మహాసముద్రం లాంటి పార్టీలో ఆమె ఉనికినే ప్రశ్నార్థకం చేశారు.

2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో విజయశాంతి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాములమ్మ బయటకు రాలేదు. కాంగ్రెస్ తరఫున మాట్లాడలేదు. కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. అజ్ఞాతంలో ఉండిపోయారు. ఈ మధ్య హైదరాబాద్ మహంకాళీ ఉత్సవాలకు హాజరై మళ్లీ చురుకైన పాత్ర పోషించాలని భావించారు. కానీ ఆమెను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. ఎన్నికల వేళ మళ్లీ వచ్చిందంటూ ఈసడించుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాని విజయశాంతిని పట్టించుకోలేదు.

దీంతో ప్రస్తుతం రాములమ్మ ఎంత కలిసిపోదామన్నా కాంగ్రెస్ పెద్దలు కలుపుకోవడం లేదట. విజయశాంతి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి ప్రచారం చేస్తానని చెబుతున్నా రాష్ట్ర నేతలు పట్టించుకోకపోయేసరికి తాజాగా విజయశాంతి కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించారట. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కమిటీ వేయాలని సూచించారట.

మధుయాష్కీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు తన పేరును జోడించి కమిటీ వేస్తే ప్రభావముంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారట.. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ సీనియర్లతో ప్రచార కమిటీని నియమిస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశారట… ఈ మేరకు ఏఐసీసీని కోరినట్టు తాజా సమాచారం.

అయితే రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ తెలంగాణ లీడర్ షిప్ ను విజయశాంతి చేతిలో పెట్టడానికి ఏఐసీసీ పెద్దలు సిద్ధంగా లేనట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాగా పనిచేస్తున్నాడని… ఇప్పుడున్న సమయంలో మార్పులు చేర్పులు కుదరవని స్పష్టం చేస్తున్నారట.

ఉత్తమ్ తో కలిసి ప్రచారం చేస్తే ఫర్వాలేదని.. సపరేట్ గా ప్రచార కమిటీ వేసి మళ్లీ కాంగ్రెస్ లో వర్గపోరుకు తెరతీయలేమనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. దీంతో రాములమ్మ కోరికకు వారు ఒప్పుకోవడం లేదని సమాచారం. తన మాటకు విలువలేని కాంగ్రెస్ లో రాములమ్మ ఉంటుందా.? బయటకు వస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.

First Published:  18 Sept 2018 1:22 AM GMT
Next Story