Telugu Global
NEWS

మంత్రి జగదీశ్‌రెడ్డిపై రెక్కీ?

విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదా? స్థానికుల కథనం ప్రకారం సెప్టెంబరు 2వ తేదీన జగదీశ్‌రెడ్డి స్వగ్రామం తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ సాయంతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు, అటు నుంచి తుంగతుర్తి రోడ్డు, హెల్త్‌సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులనూ, గ్రామం […]

మంత్రి జగదీశ్‌రెడ్డిపై రెక్కీ?
X

విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదా? స్థానికుల కథనం ప్రకారం సెప్టెంబరు 2వ తేదీన జగదీశ్‌రెడ్డి స్వగ్రామం తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తున్నది.

ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ సాయంతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు, అటు నుంచి తుంగతుర్తి రోడ్డు, హెల్త్‌సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులనూ, గ్రామం నుంచి బయటికి వెళ్లే డొంక రోడ్లనూ చిత్రీకరించారని చూసిన గ్రామస్తులు చెబుతున్నారు.

చివరగా మంత్రి ఇల్లు, పరిసరాలను చిత్రీకరించారని వారు చెబుతున్నారు. తొలుత ఏదో రోడ్ల సర్వే జరుగుతున్నదను కున్నామని, చివరగా మంత్రి ఇంటి పరిసరాలను చిత్రీకరించుకుని వెళ్లిపోయిన తర్వాత తమకు అనుమానం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

మంత్రి స్వగ్రామానికి వచ్చినపుడు సెక్యూరిటీని పక్కనబెట్టి గ్రామస్తులతో కలసిపోతారు. ముసలీ ముతకా తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా మాట్లాడతారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. తనకు బాగా సన్నిహితంగా ఉండే ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇండ్లల్లోకి వెళ్లి, అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఇటువంటి సందర్భాన్ని ఆసరాగా తీసుకుని దాడిచేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా సురక్షితంగా తప్పించుకోవచ్చన్న భావనతో వారు ఈ రెక్కీ చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

First Published:  18 Sept 2018 12:09 AM GMT
Next Story