Telugu Global
Cinema & Entertainment

మరోసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది

హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. హాలీవుడ్ లో ప్రారంభమైన మీ-టూ అనే ఉద్యమానికి మద్దతుగా బాలీవుడ్ లో పలు స్వచ్చంధ సంస్థలకు మద్దతు ప్రకటిస్తున్న ఈ బ్యూటీ.. మరోసారి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. టాలీవుడ్ లో ఓ పెద్ద హీరో తనను పక్కలోకి రమ్మన్నాండంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చి గతంలో సంచలనం సృష్టించిన ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. తనకు వెన్నునొప్పి […]

మరోసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది
X

హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. హాలీవుడ్ లో ప్రారంభమైన మీ-టూ అనే ఉద్యమానికి మద్దతుగా బాలీవుడ్ లో పలు స్వచ్చంధ సంస్థలకు మద్దతు ప్రకటిస్తున్న ఈ బ్యూటీ.. మరోసారి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. టాలీవుడ్ లో ఓ పెద్ద హీరో తనను పక్కలోకి రమ్మన్నాండంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చి గతంలో సంచలనం సృష్టించిన ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ వ్యవహారాన్ని బయటపెట్టింది.

తనకు వెన్నునొప్పి ఉందని, అయినప్పటికీ ఆ బాధను భరిస్తూ ఓ హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పిన రాధిక ఆప్టే.. షూటింగ్ తర్వాత లిఫ్ట్ లో గదికి వెళ్తుంటే.. తన సహ-నటుడు ఒకడు రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడనే విషయాన్ని బయటపెట్టింది రాధిక. తను పక్క గదిలోనే ఉంటానని, అర్థరాత్రి ఫోన్ చేస్తే, వచ్చి నడుముకు మసాజ్ చేస్తానని తనతో అన్నాడంటూ రాధిక ఆరోపించింది.

రాధిక స్టేట్ మెంట్ తో ఆ బాలీవుడ్ నటుడు ఎవరై ఉంటారనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతోంది. అయితే మరుసటి రోజు అదే నటుడు తనవద్దకొచ్చి క్షమాపణలు కూడా చెప్పాడని రాధిక, ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

First Published:  17 Sept 2018 2:23 PM IST
Next Story