Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ వస్తోంది

వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో సైలెంట్ గా తన మూడో సినిమా పనిపూర్తిచేస్తున్నాడు అఖిల్. అయితే అఖిల్ ఎంత సైలెంట్ గా షూటింగ్ చేద్దామనుకున్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై ఆరాలు తీస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు అఖిల్ మూడో సినిమాకు సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చింది. మరో 4 రోజుల్లో (సెప్టెంబర్ 20న) ఏఎన్నార్ జయంతి రాబోతోంది. ఆ సందర్భంగా అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న […]

అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ వస్తోంది
X

వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో సైలెంట్ గా తన మూడో సినిమా పనిపూర్తిచేస్తున్నాడు అఖిల్. అయితే అఖిల్ ఎంత సైలెంట్ గా షూటింగ్ చేద్దామనుకున్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై ఆరాలు తీస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు అఖిల్ మూడో సినిమాకు సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చింది.

మరో 4 రోజుల్లో (సెప్టెంబర్ 20న) ఏఎన్నార్ జయంతి రాబోతోంది. ఆ సందర్భంగా అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా మిస్టర్ మజ్ను అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. సో.. అదే పేరుమీద ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.

తొలిప్రేమతో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు వెంకీ అట్లూరి. అందుకే అఖిల్ వెంటనే ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా ప్రేమకథనే సెలక్ట్ చేసుకున్నాడు వెంకీ. నిథి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ ను లండన్ లో చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

First Published:  16 Sept 2018 6:11 AM IST
Next Story