వ్యాయామానికి వయసుతో పనిలేదు
వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త వయసు నుంచి అలవాటు ఉన్న వారు మాత్రమే 60,70లలో కూడా వ్యాయామం చేయవచ్చు. అంతే తప్ప ఈ వయసులో వ్యాయామం మొదలుపెట్టరాదు అని కొంత మంది అపోహపడతారు. కాని వాస్తవం… ఏమిటంటే ఈ అభిప్రాయం తప్పు. వ్యాయామాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు… అంటున్నారు […]
వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త వయసు నుంచి అలవాటు ఉన్న వారు మాత్రమే 60,70లలో కూడా వ్యాయామం చేయవచ్చు. అంతే తప్ప ఈ వయసులో వ్యాయామం మొదలుపెట్టరాదు అని కొంత మంది అపోహపడతారు. కాని వాస్తవం… ఏమిటంటే ఈ అభిప్రాయం తప్పు. వ్యాయామాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు… అంటున్నారు అమెరికాలోని జిమ్ నిర్వాహకులు. దాదాపు 50 మంది పురుషులు, స్త్రీలు 87 ఏళ్ల వయసులో వెయిట్స్‌తో వర్కవుట్స్ చేశారు. పదివారాల్లో వీరి కండరాలు 113శాతం శక్తిమంతం అయ్యాయి. దీంతోపాటు పదివారాల తర్వాత వారి నడకవేగంలో గణనీయమైన మార్పు కనిపించింది. ఇది అమెరికాలో జిమ్ నిర్వాహకులు నిశితంగా గమనించి చెప్పిన విషయం.