"@నర్తనశాల" సినిమా రివ్యూ
రివ్యూ: @నర్తనశాల రివ్యూ రేటింగ్: 1.5/5 తారాగణం: నాగ శౌర్య, కశ్మీర, యామిని భాస్కర్, శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డి, అజయ్, సత్యం రాకేష్ తదితరులు సంగీతం: మహతి స్వరసాగర్ నిర్మాత: ఐరా క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి సినిమా ప్రారంభానికి ముందు రాహుల్ ద్రావిడ్ వచ్చి ధూమపానం చేయకండి మంచిది కాదని సెలవిస్తాడు. ముందు ముందు కొన్ని తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు టైటిల్ కార్డ్స్ లోనే ఇది చూడటం మీ రిస్క్ అని వేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకపక్క ఓవర్సీస్ మార్కెట్ లో మిలియన్ డాలర్ల సినిమాలు మన స్థాయిని […]
రివ్యూ: @నర్తనశాల రివ్యూ
రేటింగ్: 1.5/5
తారాగణం: నాగ శౌర్య, కశ్మీర, యామిని భాస్కర్, శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డి, అజయ్, సత్యం రాకేష్ తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాత: ఐరా క్రియేషన్స్
దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి
సినిమా ప్రారంభానికి ముందు రాహుల్ ద్రావిడ్ వచ్చి ధూమపానం చేయకండి మంచిది కాదని సెలవిస్తాడు. ముందు ముందు కొన్ని తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు టైటిల్ కార్డ్స్ లోనే ఇది చూడటం మీ రిస్క్ అని వేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకపక్క ఓవర్సీస్ మార్కెట్ లో మిలియన్ డాలర్ల సినిమాలు మన స్థాయిని పెంచుతూ పోతుంటే కొన్ని మాత్రం అంతకంతకూ తీసికట్టుగా తయారవుతూ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ”@నర్తనశాల” లాంటి క్లాసిక్ టైటిల్ తో నాగ శౌర్య సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఊహించుకున్నారు.
రాధాకృష్ణ (నాగ శౌర్య) అమ్మాయిల్లో మనో ధైర్యాన్ని నింపే ఒక ఇన్ స్టిట్యూట్ నడుపుతూ ఉంటాడు. తను టేకప్ చేసిన కేసు వల్ల పరిచయమైన మానస (కశ్మీర) ప్రేమలో పడుతుంది. కానీ మానస చెల్లెలు సత్య (యామిని భాస్కర్) రాధాకృష్ణను ప్రేమిస్తుంది. పొరపాటున రాధాకృష్ణ తండ్రి (శివాజీ రాజా) సత్యతో పెళ్లి ఫిక్స్ చేసి ఆమె తండ్రి రాయుడు(జయప్రకాష్ రెడ్డి)కి మాట ఇస్తాడు. పెళ్లి తప్పాలనే కారణం మీద రాధాకృష్ణ తాను ‘గే’ అని చెప్పుకుంటాడు. ఇక అక్కడ నుంచి ‘గే’ హింస మొదలవుతుంది. మరి ఇది ఎక్కడి కాదా వెళ్ళింది స్క్రీన్ పైనే చూడాలి.
తాను ఏ సినిమా చేసినా జనం గుడ్డిగా చూసే రేంజ్ కి నాగ శౌర్య ఇంకా చేరలేదు. అందుకే ఇందులో తెలిపోయాడు. లుక్స్ పరంగా మంచి అందం ఉన్న శౌర్య స్వంత బ్యానర్ లో ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే. హీరోయిన్లు కశ్మీర, యామిని భాస్కర్ పైసా తీసుకోకుండా నటించారేమో…. కనీసం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడానికి కూడా కష్టపడ్డారు. ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువ ఇచ్చారేమో శివాజీ రాజా అవసరానికి మించి నటించాడు. జయప్రకాష్ రెడ్డి సీమ యాసలో విసిగిస్తారు. అజయ్ నిజమైన ‘గే’ గా బాగానే మెప్పించాడు. సుధ, గుండు సుదర్శనం, సత్యం రాకేష్ ఎవరూ తగ్గలేదు. పోటీ పడి మరీ ఓవర్ చేశారు.
దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మొదటి సినిమాకే ఇలాంటి కథను తీసుకోవడం విచిత్రం. ‘గే’ హీరోగా చేయటం అనే పాయింట్ కి కట్టుబడకుండా ఇష్టం వచ్చినట్టు కథను మలుపులు తిప్పడం వల్ల ఆసక్తి రేపకపోగా అసహనం అడుగడుగునా కలగడం స్క్రీన్ ప్లే లోపమే.
ఫస్ట్ హాఫ్ లోనే ఫ్లో దెబ్బ తినగా అర్థం లేని కామెడీతో సన్నివేశాలు సాగదీయడం మైనస్ గా నిలిచింది. మహతి స్వరసాగర్ సంగీతం పర్వాలేదు. ఇంకాస్త మనసు పెడితే మంచి ఔట్ ఫుట్ ఇవ్వగల సత్తా ఉంది. కెమెరా పనితనం మాత్రం రిచ్ లుక్ వచ్చేలా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ లేకుండానే ఫైనల్ చేసినట్టు ఉన్నారు. అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఐరా నిర్మాణ విలువలు ఒకే.
ఆఖరిగా చెప్పాలంటే పేరుకి కంటెంట్ కి ఏ మాత్రం సంబంధం లేని ఓ మామూలు సినిమా ”@నర్తనశాల”. పేరుకి కామెడీ జానర్ అయినప్పటికీ నవ్వు తెప్పించలేని ఒక హారర్ మూవీగా మిగిలిపోయింది. తలా తోకా లేని కథా కథనాలతో తీస్తే…. ప్రేక్షకులు గుడ్డిగా ఆదరించరన్న సత్యాన్ని గుర్తించనంత కాలం ఇలాంటివి వస్తూనే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద చేదు ఫలితాన్ని అందుకుంటూనే ఉంటాయి.
@నర్తనశాల – పస లేని నస కామెడీ