Telugu Global
WOMEN

స‌మ్మ‌ర్‌లో సొగ‌సుగా....

వేస‌విలో మ‌ల్లెలు పూస్తాయి కానీ, మ‌నుషుల మొహాలు మాత్రం వాడిపోయి క‌నిపిస్తుంటాయి. మ‌రి మండు వేస‌విలో తాజా మ‌ల్లిక‌లా మెర‌వాలంటే ఇవ‌న్నీ పాటించాల్సిందే…. పిండి ప‌దార్థాలు, తీపి ఎక్కువ‌గా ఉన్న ఆహారానికి నో చెప్పండి. ప‌నిలో కానీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో అనుబంధాల ప‌రంగా గానీ ఒత్తిడి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఈ జాగ్ర‌త్త‌ల‌తో మొహంమీద మొటిమలు రాకుండా నివారించుకోవ‌చ్చు. ఎక్కువ జిడ్డు, గాఢత ఉన్న కాస్మొటిక్స్, క్లీనింగ్ సాధ‌నాల‌ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. ఇవి చ‌ర్మానికి […]

స‌మ్మ‌ర్‌లో సొగ‌సుగా....
X

వేస‌విలో మ‌ల్లెలు పూస్తాయి కానీ, మ‌నుషుల మొహాలు మాత్రం వాడిపోయి క‌నిపిస్తుంటాయి. మ‌రి మండు వేస‌విలో తాజా మ‌ల్లిక‌లా మెర‌వాలంటే ఇవ‌న్నీ పాటించాల్సిందే….

  • పిండి ప‌దార్థాలు, తీపి ఎక్కువ‌గా ఉన్న ఆహారానికి నో చెప్పండి. ప‌నిలో కానీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో అనుబంధాల ప‌రంగా గానీ ఒత్తిడి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఈ జాగ్ర‌త్త‌ల‌తో మొహంమీద మొటిమలు రాకుండా నివారించుకోవ‌చ్చు.
  • ఎక్కువ జిడ్డు, గాఢత ఉన్న కాస్మొటిక్స్, క్లీనింగ్ సాధ‌నాల‌ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. ఇవి చ‌ర్మానికి ప‌డ‌క‌పోతే చ‌ర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇరిటేష‌న్ క‌లిగిస్తాయి. దాంతో మొటిమలు, ద‌ద్దుర్లు లాంటివి వ‌స్తాయి.
  • మృదువైన‌, త‌క్కువ గాఢత క‌లిగిన క్లెన్స‌ర్ తో మొహాన్ని శుభ్రం చేసుకోవ‌డం, మొహాన్ని త‌ర‌చుగా చ‌ల్ల‌ని నీటితో క‌డ‌గ‌టం వ‌ల‌న చ‌ర్మం తాజాగా ఉండ‌టంతో పాటు మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.
  • యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోష‌కాలు నిండుగా ఉన్న ప‌ళ్లు, కూర‌గాయ‌లు తీసుకోవ‌డం వ‌ల‌న ఆరోగ్యంతో పాటు చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.
  • మంచినీళ్లు ఎక్కువ‌గా తాగాలి. నీరు త‌గినంత ఉంటే శ‌రీరంలోని వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు తేలిగ్గా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. దాంతో చ‌ర్మం మృదువుగా తాజాగా క‌న‌బ‌డుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం క‌ద‌ల‌కుండా కూర్చోవ‌టం, బ‌ద్ద‌కం లాంటివి వ‌దిలేయండి. శ‌రీరం చురుగ్గా ఉంటే చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.
  • వ్యాయామం త‌రువాత త‌ప్ప‌నిస‌రిగా స్నానం చేయాలి. అప్పుడే చ‌ర్మం మీద ఏర్ప‌డిన మృత క‌ణాలు తొల‌గిపోయి చ‌ర్మం తాజాగా మారుతుంది. ఆలాగే మెత్త‌ని కాట‌న్ దుస్తులు, అవీ కాస్త వ‌దులుగా ఉండేలా చూసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఇవ‌న్నీ మ‌నం త‌ర‌చుగా ఎక్క‌డో ఒక‌చోట వింటూ, చ‌దువుతూనే ఉంటాం. కానీ పాటించ‌డం విష‌యానికి వ‌చ్చేస‌రికి అశ్ర‌ద్ధ చేస్తాం. బ‌త‌క‌డం, జీవించ‌డం ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. య‌ధాలాపంగా బ‌తికేయ‌డం కాకుండా కాస్త కాన్ష‌స్‌గా మ‌న‌కు మేలు చేసే వాటిని ఎంపిక చేసుకుని జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటే జీవితం మ‌న చేతుల్లో ఉన్న‌ట్టుగా ఉంటుంది. చిన్న‌వీ, పెద్ద‌వీ అన్నిటికీ ఇది వ‌ర్తిస్తుంది మ‌రి.

First Published:  30 May 2018 6:00 AM IST
Next Story