కన్యలుగా ఉండండి...కానుకలు పుచ్చుకోండి!
కన్యలుగా ఉండండి…కానుకలు పొందండి… అంటోంది దక్షిణాఫ్రికా లోని ఒక జిల్లా పాలనా యంత్రాంగం. టీనేజి ప్రెగ్నెన్సీని అరికట్టడానికి, విజృంభిస్తున్న హెచ్ఐవి, ఎయిడ్ప్ సమస్యలను అదుపు చేయడానికి వారికి అంతకంటే మార్గం కనబడలేదు. ఎంతకాలం అమ్మాయిలు వర్జిన్‌లుగా ఉండగలుగుతారో అంతకాలం వారి చదువుకోసం స్కాలర్‌షిప్పులను మంజూరు చేస్తున్నారు ఆ పాలకులు. డర్బన్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉథుకేలా జిల్లాలోని అమ్మాయిలు ఇప్పుడు తమకు సాధ్యంకాని ఉన్నత చదువులను చదువుతున్నారు. బర్సరీ అనే పేరుతో ఇస్తున్న ఈ స్కాలర్‌షిప్స్ […]
కన్యలుగా ఉండండి…కానుకలు పొందండి… అంటోంది దక్షిణాఫ్రికా లోని ఒక జిల్లా పాలనా యంత్రాంగం. టీనేజి ప్రెగ్నెన్సీని అరికట్టడానికి, విజృంభిస్తున్న హెచ్ఐవి, ఎయిడ్ప్ సమస్యలను అదుపు చేయడానికి వారికి అంతకంటే మార్గం కనబడలేదు. ఎంతకాలం అమ్మాయిలు వర్జిన్‌లుగా ఉండగలుగుతారో అంతకాలం వారి చదువుకోసం స్కాలర్‌షిప్పులను మంజూరు చేస్తున్నారు ఆ పాలకులు.
డర్బన్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉథుకేలా జిల్లాలోని అమ్మాయిలు ఇప్పుడు తమకు సాధ్యంకాని ఉన్నత చదువులను చదువుతున్నారు. బర్సరీ అనే పేరుతో ఇస్తున్న ఈ స్కాలర్‌షిప్స్ వారి జీవితాలను మార్చేస్తున్నాయి. సంవత్సరానికి కొన్నివేల డాలర్లను ఈ గ్రాంట్స్ రూపంలో మంజూరు చేస్తున్నారు. పేదరికం కారణంగా చదువుని మధ్యలో ఆపేసి పనులు చేసుకుని బతుకుతున్న అమ్మాయిల జీవితాల్లో ఈ స్కాలర్‌షిప్స్ చాలా మార్పులు తెచ్చాయి. పేదరికం కారణంగా యూనివర్శిటీ చదువుని ఆపేసిన ఓ విద్యార్థిని తన చదువుకోసం 32 ఏళ్ల వయసు వచ్చినా వర్జిన్‌గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా, ఎంత శాతం మార్కులు వచ్చాయి అనే విషయాన్ని కూడా చూడకుండా ఈ స్కాలర్‌షిప్పులను మంజూరు చేస్తున్నారు.
అయితే వీటిని మంజూరు చేసే ముందు పెద్దవయసున్న మహిళలు నిర్వహించే కన్యత్వ పరీక్షలకు వారు సిద్ధం కావాలి. ఇప్పటివరకు 16మంది యువతులు ఈ విధంగా లబ్దిని పొందుతున్నారు.
మానవహక్కుల ఉద్యమకారులు దీనిపై మండిపడుతున్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛని హరించడమే అని వారు భావిస్తున్నారు. ఈ విధానం మహిళా హక్కులను హరించి వేస్తుందని, ఇది పితృస్వామ్య భావజాలపు ఆలోచన అని మహిళా హక్కుల ఉద్యమకారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఉథుకేలా అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు.
తమ జిల్లాలో టీనేజి గర్భధారణలు హెచ్చుగా ఉండటం, హెచ్ఐవికి గురైనవారు అధికంగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉథుకేలా మహిళా మేయర్ డుడు మజిబుకో అంటున్నారు. దక్షిణాఫ్రికాలో 25శాతం మంది అమ్మాయిలు 19ఏళ్లకల్లా గర్భం దాలుస్తున్నారు. అమ్మాయిలు కూడా ఈ పరీక్షలను అవమానకరంగా భావించడం లేదు. ఇందులో ఎలాంటి అవమానం, బాధ లేదని వారు చెబుతున్నారు.
ఇలాంటి స్కాలర్‌షిప్స్‌ని మగపిల్లలకు కూడా ఇవ్వాలనేది మేయర్ డుడు మజిబుకో ఆలోచన. అయితే వారికి ఎలాంటి పరీక్షలతో బ్రహ్మచర్యాన్ని పరీక్షిస్తారో ఆమె వెల్లడించలేదు. బర్సరీ పథకాన్ని విమర్శించేవారు హెచ్ఐవి ఎయిడ్స్‌లను అరికట్టడానికి మరేదైనా పథకం చెప్పాలని మజిబుకో అంటున్నారు.
Also Read: