వైఎస్ వివేకానందరెడ్డీ బాధితుడే
మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డికి కూడా కడప జిల్లా అధికారుల దెబ్బకు టెన్షన్ తప్పడం లేదు. ఏకంగా వివేకానందరెడ్డి భూమిని ఆక్రమించేసినంత పని చేశారు. ఆయనకు చెందిన భూమిలో నీరు చెట్టు పనులు చేపట్టారు. మట్టి తీయడం, గుంతలు తవ్వడం చేసేశారు. దీంతో తన భూమి జోలికి రావద్దంటూ వివేకానందరెడ్డి అధికారుల వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కడప జిల్లా ముద్దనూరు మండలంలోని పెద్దదుద్యాల వద్ద వివేకానందరెడ్డికి వ్యవసాయ భూమి […]
మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డికి కూడా కడప జిల్లా అధికారుల దెబ్బకు టెన్షన్ తప్పడం లేదు. ఏకంగా వివేకానందరెడ్డి భూమిని ఆక్రమించేసినంత పని చేశారు. ఆయనకు చెందిన భూమిలో నీరు చెట్టు పనులు చేపట్టారు. మట్టి తీయడం, గుంతలు తవ్వడం చేసేశారు. దీంతో తన భూమి జోలికి రావద్దంటూ వివేకానందరెడ్డి అధికారుల వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కడప జిల్లా ముద్దనూరు మండలంలోని పెద్దదుద్యాల వద్ద వివేకానందరెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. అయితే కొందరు టీడీపీ నేతల ప్రోద్బలంతో అధికారులు అక్రమంగా నీరు- చెట్టు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న వివేకానందరెడ్డి తహసీల్దార్ రమ, ఎంపీడీవో మనోహర్ వద్దకు వచ్చి జరుగుతున్న తతంగాన్ని వివరించారు. అయితే వారు ఆ వ్యవహారం తమ పరిధిలోకి రాలేదని చెప్పారు. దీంతో ఆయన ఇరిగేషన్ డీఈ రాజన్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. తన వ్యవసాయ భూమిలో అక్రమంగా పనులు చేయడం ఏమిటని వివేకా ప్రశ్నించారు. అసలు అనుమతులు ఇచ్చిన వారు ఎవరని నిలదీశారు. ఇంత అన్యాయంగా తన భూమిలోకి వచ్చి ఎలా పనులు చేస్తారని వివేకా మండిపడ్డారు. దీంతో సదరు విషయం తనకు తెలియదని చెప్పారు. వెంటనే పనులు ఆపించాలని వివేకా డిమాండ్ చేశారు.