పాతబస్తీలో దెయ్యాల దందా!
పాతబస్తీలో దెయ్యాల దందా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదేంటి? దెయ్యాలతో దందా ఎవరు చేస్తారు? అనే కదా మీ ప్రశ్న. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లుగా… సులువుగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ల బుర్రలకు ఇంతకన్నా మంచి ఆలోచనలు వస్తాయా? ఇలాంటి వారంతా మంత్రగాళ్ల అవతారమెత్తుతున్నారు. దెయ్యాలు పట్టాయని, వాటిని వదిలిస్తామంటూ క్షుద్రపూజలు చేసి అమాయకుల నుంచి వేల రూపాయల డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి మంత్రగాళ్లపై ఫిర్యాదులు పెరిగిపోవడందో దక్షిణమండలం పోలీసులు దాడులు జరిపి 16 మంది మంత్రగాళ్లను […]
BY sarvi28 Sept 2016 2:30 AM IST
X
sarvi Updated On: 28 Sept 2016 6:41 AM IST
పాతబస్తీలో దెయ్యాల దందా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదేంటి? దెయ్యాలతో దందా ఎవరు చేస్తారు? అనే కదా మీ ప్రశ్న. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లుగా… సులువుగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ల బుర్రలకు ఇంతకన్నా మంచి ఆలోచనలు వస్తాయా? ఇలాంటి వారంతా మంత్రగాళ్ల అవతారమెత్తుతున్నారు. దెయ్యాలు పట్టాయని, వాటిని వదిలిస్తామంటూ క్షుద్రపూజలు చేసి అమాయకుల నుంచి వేల రూపాయల డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి మంత్రగాళ్లపై ఫిర్యాదులు పెరిగిపోవడందో దక్షిణమండలం పోలీసులు దాడులు జరిపి 16 మంది మంత్రగాళ్లను అరెస్టు చేయడంతో వీరి భండారం బయటపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారులు చేసే వ్యక్తులు చాలామందే ఉన్నారు. విదేశాల్లో ఉంటారు కాబట్టి వీరు సహజంగానే ఆస్తిపరులు. మంత్రగాళ్లు వీరినే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణం ఇదే! ఇలాంటి వారి ఇళ్లల్లోకి సాధారణ భిక్షకు వెళ్లినట్లుగా నటిస్తారు. డబ్బున్న వారి ఇళ్ల పిల్లలు సహజంగానే అల్లరి ఎక్కువ చేస్తుంటారు. దీన్ని అవకాశంగా తీసుకుని పిల్లాడికి దెయ్యం పట్టిందని భయపెడుతున్నారు. దాన్ని వదిలించాలంటే చాలా ఖర్చు అవుతుందని నమ్మబలుకుతారు. తరువాత ఆ పూజలు.. ఈ పూజలు అంటూ వారిని మరింత భయపెట్టి తరువాత దెయ్యం వదిలిందని చెబుతారు. ఇంకేముంది… పూజలు చేసినందుకు ప్రతిఫలంగా వేలాది రూపాయలు, భారీగా కానుకలు తీసుకుంటారు. ఇదీ.. పాతబస్తీలో జరుగుతున్న దెయ్యాల దందా! ఇది మంచి లాభసాటిగా ఉండటంతో చాలామంది దీన్ని తమ వృత్తిగా ఎంచుకోవడం మొదలు పెట్టారు. పోటీ పెరగడం, వీరి కదలికలు అధికమవడంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు16 మంది మంత్రగాళ్లను అరెస్టు చేశారు.
Click on Image to Read:
Next Story