బాబే ఆడుకుంటున్నారా? లేక ఆయనతోనే ఆడుకుంటున్నారా…
ముఖ్యమంత్రితో టెలికాన్ఫరెన్స్ అంటే ఏ అధికారికైనా టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అంటే అధికారులు చాలా లైట్ తీసుకుంటున్నారు. రోజూ ఉదయమే కాన్ఫరెన్స్ అనే సరికి అధికారులు తొలుత కంగారు పడ్డారు. కానీ తర్వాత బాబు టెలి కాన్ఫరెన్స్‌కు విరుగుడు కనిపెట్టారట అధికారులు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లతో తమ వ్యక్తిగత సమయంతో పాటు ఆఫీస్ సమయం కూడా వృధా చేస్తున్నారన్నది అధికారుల బాధ. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఏ రేంజ్‌లో చికాకు కలిగిస్తున్నాయన్న దానికి ఉదాహరణ చంద్రబాబు లీకు […]
ముఖ్యమంత్రితో టెలికాన్ఫరెన్స్ అంటే ఏ అధికారికైనా టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అంటే అధికారులు చాలా లైట్ తీసుకుంటున్నారు. రోజూ ఉదయమే కాన్ఫరెన్స్ అనే సరికి అధికారులు తొలుత కంగారు పడ్డారు. కానీ తర్వాత బాబు టెలి కాన్ఫరెన్స్‌కు విరుగుడు కనిపెట్టారట అధికారులు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లతో తమ వ్యక్తిగత సమయంతో పాటు ఆఫీస్ సమయం కూడా వృధా చేస్తున్నారన్నది అధికారుల బాధ. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఏ రేంజ్‌లో చికాకు కలిగిస్తున్నాయన్న దానికి ఉదాహరణ చంద్రబాబు లీకు మీడియా కథనమే. సీఎం చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారని, అధికారులు వాపోతున్నారని బాబు పత్రికే వాపోయింది. నిర్మాణాత్మక సూచనలు, పరిష్కారాలు చూపకుండా తూతూ మంత్రంగానే వ్యవహారం నడుస్తోందని పత్రికే రాసుకొచ్చింది. అయితే ఇక్కడ మరికొన్ని కీలక విషయాలు ఏమిటంటే.
చంద్రబాబు ఉదయం 8.30కే టెలికాన్ఫరెన్స్‌లు మొదలుపెట్టేసరికి అధికారులు కుటుంబపరంగానూ, వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడుతున్నారు. సీఎంతో కాన్ఫరెన్స్ అంటే గంట ముందే ఫ్రీపేర్ కావాలి. అంటే తెల్లవారుజామునే లేచి వ్యక్తిగత అవసరాలు తీర్చుకుని, కుటుంబసభ్యుల సంగతి పక్కన పడేసి చంద్రబాబు ఫోన్ కాల్‌కు కాపు కాయాలన్న మాట. తొలుత దీన్ని చాలా సీరియస్‌గానే తీసుకుని పనిచేసిన అధికారులు… సీఎం కాన్ఫరెన్స్‌లు నిత్యకృత్యమయ్యే సరికి బీభత్సమైన ఎత్తు వేశారు. అదేంటంటే చంద్రబాబు నిర్వహిస్తున్నది టెలికాన్ఫరెన్స్‌లే. అంటే అవతలి వాళ్లు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్నది సీఎంకు కనిపించదు. దీన్ని ఆసరగా చేసుకుని అధికారులు తమ సెల్‌ఫోన్లకు ఇయర్ ఫోన్స్ తలిగించి ఫోన్ జేబులో వేసుకుని మిగిలిన పనులు చేసుకుంటున్నారు. బాత్ రూమ్ వెళ్లినా మొబైల్ తీసుకునే వెళ్తున్నారట కొందరు అధికారులు. చంద్రబాబు కూడా రోజూ చెప్పిన విషయాలే చెబుతుండే సరికి మ్యాటర్‌ను మరీ సీరియస్‌గా వినాల్సిన అవసరం అధికారులకు ఉండడం లేదు. కాన్ఫరెన్స్ మొదలవగానే చంద్రబాబే ఒక గంటపాటు తాను చెప్సాల్సింది చెబుతూ వెళ్తుంటారు. చివర్లో ముగ్గురు నలుగురు అధికారులు మాత్రమే తమ అభిప్రాయాలను చెబుతుంటారు. దీంతో మిగిలిన అధికారులంతా కాన్ఫరెన్స్‌ను వింటూ గడిపేస్తున్నారు. ఈ విషయం కొందరు సీనియర్ మంత్రులకు కూడా తెలిసినా చంద్రబాబుకు చెప్పేందుకు వెనుకాడుతున్నారట.
టెలి కాన్ఫరెన్స్ మంచిదేనని, దాన్ని వల్ల చాలా సమయం ఆదా అవుతుందని.. కానీ ఇప్పుడు చంద్రబాబు నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్‌లు మాత్రం సమయాన్ని వృథా చేస్తున్నాయని ఒక సీనియర్ మంత్రే వాపోయినట్టు పత్రిక, టీవీ ఛానల్ ఉన్న బాబు అనుకూల మీడియా సంస్థ వాపోయింది. చంద్రబాబు నెలకొకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే అందరూ శ్రద్ధగా విని పాటిస్తారుగానీ పదేపదే కాన్ఫరెన్స్‌లు పెడితే దానితో సీరియస్‌నెస్ పోతోందని ఒక యువ ఎమ్మెల్యే కూడా అభిప్రాయపడ్డారట. మొత్తం మీద చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అంటే అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధులకు బోర్ వచ్చేసిందన్న మాట. చంద్రబాబు చెప్పే విషయాలు కూడా పాతవే ఉంటున్నాయని ఆయన అనుకూల పత్రికే చెప్పడం బట్టి చంద్రబాబు తప్పకుండా ఆలోచించుకోవాలి.