Telugu Global
NEWS

ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలిసినవాడే చంద్రబాబు

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడు. అయితే చంద్రబాబుకు ఈ లైన్‌ను కాస్త మార్చాలి. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కాదు … ఎక్కడ ఎవరిని ఇరికించి తొక్కాలో తెలిసిన వాడే చంద్రబాబు. ఏపీలో వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండడంతో రేసులో ఉన్న గుర్రాలకు గుదిబండలు కట్టి పడదోసేందుకు ప్లాన్‌ చేసినట్టే ఉన్నారు. మంత్రిపదవులను భూమానాగిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోదుగుల […]

ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలిసినవాడే చంద్రబాబు
X

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడు. అయితే చంద్రబాబుకు ఈ లైన్‌ను కాస్త మార్చాలి. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కాదు … ఎక్కడ ఎవరిని ఇరికించి తొక్కాలో తెలిసిన వాడే చంద్రబాబు. ఏపీలో వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండడంతో రేసులో ఉన్న గుర్రాలకు గుదిబండలు కట్టి పడదోసేందుకు ప్లాన్‌ చేసినట్టే ఉన్నారు. మంత్రిపదవులను భూమానాగిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ ఆశలు కూడా వారికి సొంతంగా కలిగినవి కాదు. అవసరాల కోసం చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలే. అయితే వీరిని ఒక పద్దతి ప్రకారం రేసు నుంచి తప్పించేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. కాపు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యవహారాన్నే తీసుకుంటే.

ముద్రగడ దీక్ష సమయంలో ప్రభుత్వం తరపున ట్రబుల్ షూటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పనితీరు చూసిన వారు విస్తరణ జరిగితే కాపు కోటాలో తోటకు మంత్రి పదవి ఖాయమన్న భావనకు వచ్చారు. ఆ సమయంలోనే నిమ్మకాయల చినరాజప్పను తప్పించి తోటకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆయనపై ఉన్న దళితుల శిరోముండనం కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. రోజువారీగా సాక్ష్యుల విచారణకు రంగం సిద్ధమైంది. ఆ సమయంలోనే ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఉపసంహరించుకుంది. దళితుల కేసుల వాదనకు ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాల్సి ఉన్నా తోట కేసు విషయంలో ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. మంత్రి పదవి కావాలా?. దళితుల శిరోముండనం కేసు నుంచి బయటపడడం కావాలా అన్న ఆప్షన్‌ను తోట త్రిమూర్తులు ముందు పరోక్షంగా చంద్రబాబు ఉంచారని చెబుతున్నారు. మంత్రి పదవి కావాల్సిందేనని త్రిమూర్తులు పట్టుబడితే ఆ మరుక్షణమే కేసును దళితుల వైపు బలంగా వాదించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సంకట పరిస్థితిలో పడ్డ త్రిమూర్తులు ప్రస్తుతానికి మంత్రి పదవి ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు.

మోదుగుల విషయానికొస్తే గతంలో ఎంపీగా ఆయన పనిచేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో తన సామాజికవర్గానికి చెందిన రాయపాటి సాంబశివరావు కోసం మోదుగులకు నర్సరావుపేట ఎంపీ టికెట్ చంద్రబాబు ఇవ్వలేదు. ఎంపీగా చేసిన తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏమిటని మోదుగుల ఆ సమయంలో నిరసన వ్యక్తం చేయగా.. అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. కానీ రెండున్నరేళ్లు అవుతున్నా మోదుగుల ఇంటి ముందు బుగ్గ కారు వచ్చి ఆగడం లేదు. ఎన్నికల సమయంలో టీడీపీ కోసం మోదుగుల భారీగా ఖర్చు కూడా చేశారు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మోదుగల గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితమే ఒక చోట మోదుగుల భారీ మొత్తానికి భూమిని విక్రయించారు. అందుకు సంబంధించిన నగదు ఆయన ఇంటిలో ఉండగానే ఐటీ దాడులు జరిగాయని చెబుతున్నారు. అందులో సగం మొత్తాన్ని సీజ్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ నగదు కావాలా?. మంత్రి పదవి కావాలా అన్నట్టుగా పరిస్థితిని తయారు చేశారంటున్నారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై సీఎంకు తెలియకుండా ఐటీ దాడులు జరిగే అవకాశమే లేదంటున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటున్న చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులంటే అది చిన్న విషయం కానేకాదంటున్నారు. ఇక భూమా నాగిరెడ్డి సంగతి సరేసరి.

చంద్రబాబు అధికారంలోకి రాగానే భూమాపై రౌడీ షీట్ తెరిపించారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సమయంలో దాన్ని తెలివిగా చంద్రబాబే తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. రౌడీషీట్ ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం సరికాదన్న భావన కలిగేలా భూమా రౌడీషీట్ వ్యవహారాన్ని బాగా ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే… ఇటీవల మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించేందుకు గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సమయంలో తలసాని అంశాన్ని గవర్నర్ లేవనెత్తారని చంద్రబాబు అనుకూల మీడియా కథనాలు ప్రచురించింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినప్పుడు తనను టీడీపీ నేతలు తిట్టిపోశారని… మరి ఇప్పుడు ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తున్నారని గవర్నర్ నరసింహన్ సూటిగా ప్రశ్నించారట. అంటే విలువలు, గవర్నర్‌ అభ్యంతరాలు అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ ఏకకాలంలో హ్యాండ్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రిజర్వేషన్లు ఇలా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలే మోసపోయాయి. మంత్రి పదవుల విషయంలో నలుగురు ఎమ్మెల్యేలు మోసపోయినంత మాత్రాన కొంపలు మునుగుతాయా ఏంటి?.

Click on Image to Read:
gali-janardhan-reddy

kurugondla-ramakrishna

chandrababu-naidu-ramakrishna

First Published:  28 Sept 2016 4:47 AM IST
Next Story